Begin typing your search above and press return to search.

తేజ్ ఐ లవ్ యు.. క్లిక్ అయితే హిట్టే

By:  Tupaki Desk   |   25 Jun 2018 2:22 PM GMT
తేజ్ ఐ లవ్ యు.. క్లిక్ అయితే హిట్టే
X
గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యు అనే సినిమా చేసిన సంగతి తే;తెలిసిందే. అయితే ఆ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేసింది. కరుణాకరన్ చాలా రోజుల తరువాత డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో ప్రస్తుతం అంచనాలు ఓ మాదిరిగా ఉన్నాయి.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. కరుణాకరన్ పోలికలు రెగ్యులర్ ఫార్మాట్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అల్లరి కథానాయకుడు.. అతని వెంట నలుగురు స్నేహితులు.. అందమైన హీరోయిన్.. ఆ తరువాత హీరో హీరోయిన్స్ మధ్య సరదా సన్నివేశాలు. తొలిప్రేమ నుంచి వస్తున్నవే. హ్యాపీ - డార్లింగ్ కథలను ఇందులో మిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎమోషన్ ఏ మాత్రం కనెక్ట్ అయినా యూత్ కి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

మొదట లవ్ ట్రాక్ - కామెడీ - ఎమోషన్ ఈక్వల్ బ్యాలెన్స్ చేసిన తేజ్ ఐ లవ్ యు ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అనుపమ అయితే చాలా అందంగా కనిపిస్తోంది. సాయి అల్లరి సినిమాలో వర్కౌట్ అయితే క్లిక్ అవుతాడు.ఇక గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను కేఎస్. రామారావు నిర్మించారు. ఏఒక్క సినిమాను జులై 6న రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు.