Begin typing your search above and press return to search.

కోర్టు వివాదంలో కీర్తి సురేష్ సినిమా

By:  Tupaki Desk   |   23 Oct 2016 7:27 AM GMT
కోర్టు వివాదంలో కీర్తి సురేష్ సినిమా
X

హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు ఎక్కువగా వార్తల్లో నానుతోంది. మలయాళం.. తమిళ్.. తెలుగు భాషల్లో క్రేజీ ప్రాజెక్టులు ఈమె తలుపు తట్టేస్తున్నాయి. తెలుగులో రామ్ తో కలిసి శైలజగా కనిపించిన ఈ బ్యూటీని.. స్టార్ హీరోలు ఛాన్సులివ్వడంతో క్రేజ్ నానాటికీ పెరిగిపోతోంది.

శివ కార్తికేయన్ తో కీర్తి కలిసి నటించిన సినిమా రెమో. అక్టోబర్ 7న తమిళ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ.. తెలుగులో నవంబర్ 4న విడుదల కానుంది. తమిళ్ మూవీ రిలీజ్ అయ్యి రెండు వారాలు పూర్తవుతున్న సమయంలో రెమో ఓ వివాదంలో చిక్కుకుంది. రెమోకు వినోదపు పన్ను మినహాయింపుపై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా.. జవాబివ్వాలంటూ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమిళ్ లో టైటిల్స్ పెట్టి తమిళ భాషను ప్రోత్సహించినవారికి.. వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడం అక్కడ ఆనవాయితీ.

రెమో అన్నది ఓ లాటిన్ పదం కాగా.. ఆ టైటిల్ తో వచ్చిన మూవీకి పన్ను మినహాయింపు ఎలా ఇస్తారన్నది పాయింట్. నవంబర్ 21న తదుపరి విచారణ జరగనుండగా.. కేసు తేడా వస్తే మాత్రం రెమో నిర్మాతలకు నష్టం పెద్ద మొత్తంలోనే ఉండొచ్చంటున్నారు కోలీవుడ్ జనాలు. ఇక కీర్తి సంగతి చూస్తే.. నేచురల్ స్టార్ నానితో 'నేను లోకల్ రిలీజ్ కి రెడీ అవుతుండగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-లింగుస్వామి కాంబినేషన్ లో రూపొందే సినిమాకి కీర్తి సురేష్ రెడీ అవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/