Begin typing your search above and press return to search.

పెళ్ళయ్యాక తనతో ఇదే మొదటిసారి

By:  Tupaki Desk   |   22 May 2018 4:45 PM GMT
పెళ్ళయ్యాక తనతో ఇదే మొదటిసారి
X
మాములు కపుల్స్ కంటే సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించి వాళ్లే, నిజజీవితంలో కూడా పెళ్లి చేసుకుంటే ఫాన్స్ చాలా ఆనందిస్తారు. అలాంటి క్యూట్ కపుల్స్ మన బాలీవుడ్లోనే కాదు మన సౌత్ లో కూడా ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి సినిమాల్లో కనిపించినా కనిపించక పోయినా ఈ మధ్య యాడ్స్ లో మాత్రం కనిపిస్తూ ప్రేక్షకులను మురిపిస్తున్నారు.

సూర్య-జ్యోతిక - స్నేహ-ప్రసన్న తరువాత మన టాలీవుడ్లో పెళ్లయ్యాక కలిసి యాడ్స్ లో నటించింది సమంత-నాగ చైతన్య అనే చెప్పచ్చు. వీరిద్దరూ ఈమధ్యనే ఒక యాడ్ లో కొత్తగా పెళ్లయిన జంట లాగా కనిపించగా, ఆ యాడ్స్ యూట్యూబ్ లో వైరల్ గా మారాయి. సామ్-చై టాలీవుడ్ లోనే పాపులర్ ప్రేమపక్షుల్లో ఒకరు. మరి వీరిద్దరూ కలిసి మళ్ళీ తెరపైన కనిపిస్తే ఆ మాత్రం రెస్పాన్స్ ఉండదా చెప్పండి. ఈ యాడ్ గురించి మాట్లాడుతూ " చై తో కలిసి ఈ కమర్షియల్ లో కనిపించడం చాలా ఆనందంగా ఉంది. పెళ్ళయాక తనతో కలిసి పని చేయడం ఇదే మొదటిసారి. ఇందులో కూడా కొత్తగా పెళ్లయిన జంట కారెక్టర్లే కాబట్టి ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఇంకా సంతోషంగా ఉంది" అని చెప్పింది సమంత.

ఈ యాడ్ ను చిత్రీకరించిన తరుణ్ భాస్కర్ సెట్లో చైతన్య - సమంత చేసిన అల్లరి గురించి మాట్లాడుతూ " బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి కొత్తగా పెళ్లయిన జంట ను ఆధారంగా తీసుకుని యాడ్ ను డిసైన్ చేశాం. నిజంగానే కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కాబట్టి సమంత నాగ చైతన్య చాలా కరెక్ట్ అనిపించింది. వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అయ్యింది. షూటింగ్ జరుగుతున్నంతసేపు వాళ్లిద్దరూ ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ, జోక్స్ వేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. చాలా నాచురల్ గా యాక్ట్ చేయడం వల్ల యాడ్ ఇంకా బాగా వచ్చింది" అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆన్-స్క్రీన్ అయినా, ఆఫ్-స్క్రీన్ అయినా వారి మధ్య కెమిస్ట్రీ ఎప్పుడు సూపరే అన్నట్టు లేదు.