Begin typing your search above and press return to search.

కాటమరాయుడు.. నందమూరి హీరో..

By:  Tupaki Desk   |   30 Nov 2016 4:38 AM GMT
కాటమరాయుడు.. నందమూరి హీరో..
X
పవన్ కళ్యాణ్- శృతి హాసన్ జంటగా నటిస్తున్న మూవీ కాటమరాయుడు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఆరు నెలలకు పైగా గ్యాప్ తర్వాత పవర్ స్టార్ మొదలు పెట్టిన మూవీ కావడంతో.. అంచనాలు ఎక్కువగానే ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు సెట్స్ నుంచి లీక్ అయిన ఓ ఫోటో బోలెడన్ని డౌట్స్ తీసుకొచ్చేస్తోంది.

కాటమరాయుడు సెట్స్ లో శివబాలాజీతో కలిసి తారకరత్న లంచ్ చేస్తున్న ఫోటో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఈ నందమూరి హీరోకి.. పవన్ కళ్యాణ్ మూవీకి సంబంధం ఏంటా అనే సందేహాలు కలిగిస్తోంది. కాటమరాయుడులో తారక్ ఏదన్నా కేరక్టర్ చేస్తున్నాడా అని అనుకుంటున్నారు. ఈ చిత్రంలో పవన్ కు ముగ్గురు తమ్ముళ్లు ఉన్న మాట వాస్తవమే అయినా.. ఆ పాత్రల్లో శివబాలాజీతో పాటు అజయ్.. కమల్ కామరాజు నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరి పవన్ సెట్స్ లో తారకరత్న ఏం చేస్తున్నాడబ్బా అనే సందేహం సహజం. నిజానికి శివబాలాజీ-తారకరత్నలు మాంచి ఫ్రెండ్స్. అందుకే తన ఫ్రెండ్ ని కలిసేందుకు ఇక్కడకు వచ్చాడట తారకరత్న.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/