ఫోటో స్టోరీ: కొత్త బికినీ అదరహో

Fri Oct 12 2018 22:08:38 GMT+0530 (IST)

`స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` సినిమాతో ఆలియాభట్ ని బాలీవుడ్ కి పరిచయం చేశాడు కరణ్ జోహార్. ఆ ఒక్క సినిమాతో భట్స్ డాటర్ కి యువతరంలో అద్భుతమైన క్రేజు దక్కింది. కాలేజ్ విద్యార్థిగా ఆలియా నటనకు ఫిదా అయిపోయారంతా. అందుకే అతడు ఓ డెబ్యూని పరిచయం చేస్తున్నారంటే అందరిలో ఒకటే ఆసక్తి నెలకొంటుంది. ఇటీవలే అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీని బాలీవుడ్ కి పరిచయం చేసిన కరణ్ ప్రస్తుతం ఓ అరడజను నవతరం నాయికల్ని పెద్ద తెరకు పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నాడు.బ్లాక్ బస్టర్ మూవీ `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్`కి సీక్వెల్ తీస్తున్న అతడు ఈ సినిమాతో ఇద్దరు కొత్తమ్మాయిల్ని తెరకు పరిచయం చేస్తున్నాడు. నటుడు చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే - అలానే తారా సుతారియా అనే అందగత్తెను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే అనన్య ఫేజ్ -3 వరల్డ్ లో పాపులరైంది. ఇప్పుడు తారా సుతారియా అదే రేంజులో పాపులరవుతోంది.

తాజాగా ఈ భామ తన అధికారిక ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు యూత్‌లోకి దూసుకుపోతున్నాయ్. పెర్ఫెక్ట్ బికినీ బాడీకి ఎగ్జాంపుల్ తారానే అనే చెప్పొచ్చు. ``బ్యాలెట్ బేబి పార్ట్ డీలక్స్!`` అంటూ అదిరిపోయే క్యాప్షన్ ని ఈ ఫోటోకి ట్యాగ్ చేసింది. మొత్తానికి కరణ్ అండదండలతో ఈ బ్యాలెట్ బేబి బాలీవుడ్ లో దూసుకుపోవడం ఖాయమేనని అర్థమవుతోంది. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` (టైగర్ ష్రాఫ్ హీరో) చిత్రం 2019 మేలో రిలీజ్ కానుంది.