Begin typing your search above and press return to search.

దేశభక్తురాలిగా కుమ్మేస్తున్న తాప్సీ

By:  Tupaki Desk   |   4 Aug 2015 7:31 AM GMT
దేశభక్తురాలిగా కుమ్మేస్తున్న తాప్సీ
X
రింగులజుత్తు భామ తాప్సీ నాలుగు భాషల్లో అవకాశాలు అందుకుంటోంది. తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళ భాషల్లో ఈ అమ్మడు అవకాశాల వేట సాగిస్తోంది. ఇటీవలే గంగ, కాంచన చిత్రాలతో తెలుగు, తమిళ్‌ రెండుచోట్లా చెప్పుకోదగ్గ విజయాలు అందుకుంది. ఇదే స్పీడ్‌ లో ప్రస్తుతం తమిళంలో ఓ రెండు ప్రాజెక్టు ల్లో నటిస్తోంది. శింబు సరసన 'కాన్‌' అనే యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ లో నటిస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్‌ రాణీగా కనిపించనుంది. అలాగే జర్నీ ఫేం జై సరసన తిరు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఓ సాదాసీదా పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది.

ఇదే విషయాన్ని తాప్సీ ముచ్చటిస్తూ.. 'శింబు కాన్‌ చిత్రం పూర్తి యాక్షన్‌ సినిమా. ఇందులో స్టార్ట్‌ నుంచి చివరి వరకూ పోరాట సన్నివేశాలు హైలైట్‌ గా ఉంటాయి. నేను యాక్షన్‌ పార్ట్‌ లో ఎక్కువగా కనిపిస్తాను. డిఫెన్స్‌ వింగ్‌ నుంచి దేశ సేవ కోసం వచ్చి పనిచేసే సీక్రెట్‌ ఏజెంట్‌ గా కనిపిస్తాను. ఇటీవలే బాలీవుడ్‌ లో బేబి చిత్రంలో ఆ తరహా పాత్రలో నటించాను.. అని చెప్పింది.

అంతేనా తెలుగులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించాను. తొలిసారి తమిళ్‌ లోనూ అదే తరహా పాత్రలో నటిస్తున్నా. తంబీల్ని ఈ రెండు సినిమాలు మెప్పిస్తాయి.. అని చెప్పింది. ప్రస్తుతం మరిన్ని కథలు వింటున్నానని చెప్పింది. అయితే తాప్సీ నేరుగా ఓ తెలుగు సినిమాలో నటించేదెప్పుడో?