Begin typing your search above and press return to search.

షార్ట్ ఫిలింతో గంగ సెన్సేషన్

By:  Tupaki Desk   |   31 July 2015 2:10 PM GMT
షార్ట్ ఫిలింతో గంగ సెన్సేషన్
X
తాప్సీ గేర్ మార్చేసింది. గ్లామర్ డాల్ అనే బిరుదు నుంచి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ కేరక్టర్లకు షిఫ్ట్ అవుతోంది. గంగతో తెలుగు, తమిళ భాషల్లో తాప్సీ పన్ను సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ కుర్రదానిలో ఇంత యాక్టింగ్ దాగుందా? ఇన్నేళ్లు డైరెక్టర్లు గ్లామర్ రోల్స్ ఇచ్చి... పాపం తాప్సీ కి అన్యాయం చేశారేమో అనిపించే రేంజ్‌ లో ఇరగదీసింది గంగలో.

తనలోని నటనను ప్రూవ్ చేసుకునేందుకు ఇప్పుడు మరో స్కెచ్ వేసింది తాప్సీ. షార్ట్ ఫిలిం ద్వారా బాలీవుడ్‌ కి తన ట్యాలెంట్ ప్రూవ్ చేయబోతోంది. అహల్యతో రాధికా అప్టే సృష్టించిన సెన్సేషన్ మాదిరిగానే... ఇది కూడా ఉండబోతోందని టాక్. తిమాన్షు ధూలియా అనే డైరెక్టర్ తీస్తున్న.. షార్ట్ ఫిలింలో నటించనుంది తాప్సీ. తనలో ఉన్న యాక్టర్ ని ఫుల్లుగా వాడేసుకోవాలని చెప్పిందట డైరెక్టర్ కి. బాలీవుడ్‌ లో పాగా వేసేందుకు మంచి ఐడియానే వేసింది అనిపిస్తోంది కదూ.

నిజానికి గంగ తర్వాత తాప్సీ ఫేట్ మారిపోయింది. ప్రస్తుతానికి తెలుగు సినిమా ఒకటి కూడా సైన్ చేయకపోయినా.. తమిళంలో చేతినిండా సినిమాలున్నాయి. హిందీలోనూ రెండు ప్రాజెక్టులు సైన్ చేసింది. గడియార అనే కన్నడ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది. ఇది తెలుగు, తమిళ్, మళయాళ భాషల్లో రూపొందుతోంది. గడియారకు సంబంధించి... భాషకో హీరో మారినా, అన్ని వెర్షన్ల లోనూ హీరోయిన్ మాత్రం తాప్సీనే కావడం విశేషం.