Begin typing your search above and press return to search.

జ్యోతిలక్ష్మి లా బైక్‌ నడుపుతుందిట

By:  Tupaki Desk   |   30 July 2015 1:37 PM GMT
జ్యోతిలక్ష్మి లా బైక్‌ నడుపుతుందిట
X
జ్యోతిలక్ష్మి బైక్‌ నడిపించిన తీరు ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉంది. లేడీ రెబల్‌ గా, వేశ్యగా నటించింది కాబట్టి ఛార్మి అంత డేరింగ్‌ గా బైక్‌ పై హల్‌ చల్‌ చేసింది. అయితే ఇప్పుడు అదే రేసులోకి తాప్సీ కూడా వచ్చి చేరుతోంది. ఈ అమ్మడు ప్రస్తుతం కన్నడలో ఓ సినిమా చేస్తోంది. ఇదో బహుబాషా చిత్రం. నాగశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తాప్సీ బైక్‌ నడిపించే సన్నివేశాలున్నాయి.

అయితే నిజజీవితంలో ఎప్పుడైనా బైక్‌ నడిపించారా? అని అడిగితే .. కొన్ని సీక్రెట్స్‌ గుట్టు రట్టు చేసింది. చిన్నప్పుడు రహస్యంగా బైక్‌ నడిపేదాన్ని. ఇంట్లో కొనివ్వమంటే రిస్క్‌ అవుతుందని కొనివ్వలేదు. దాంతో స్నేహితుల బైక్‌ ని రహస్యంగా నడిపించేదాన్ని.. అని చెప్పింది. అంతేనా బైక్‌ నడిపించాలన్న ఆసక్తి ఉన్నా ఎవరూ ఎంకరేజ్‌ చేసేవారు కాదు. అందుకే రేసింగులో వెనకబడిపోయానని చెప్పింది.

మొదటిసారి మిస్టర్‌ పెర్ఫెక్ట్‌ సినిమాలో బైక్‌ నడిపించాను. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ అవకాశం వచ్చింది. సెప్టెంబర్‌ లో ఈ సినిమా సెట్స్‌ కెళ్లనుంది అని చెప్పింది తాప్సీ. గంగ, కాంచన చిత్రాలతో ఘనవిజయం అందుకున్నాక తాప్సీ నటిస్తున్న తాజా ప్రాజెక్టు ఇది.