Begin typing your search above and press return to search.

తాప్సీ రాజమౌళినే ఢీకొట్టింది

By:  Tupaki Desk   |   28 July 2015 3:05 PM GMT
తాప్సీ రాజమౌళినే ఢీకొట్టింది
X
రేప్‌ ఆఫ్‌ అవంతిక ఆర్టికల్ చాలా దూరం వెళిపోతోంది. నిధానంగా మన హీరో హీరోయిన్ల ను ఇందులోకి లాగేస్తోంది . ఇక ప్రస్తుతం రింగులు జుత్తు చిన్నది తాప్సీ ఇటీవలి కాలంలో తెలుగు సినిమాకి దూరమైన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు గంగ (కాంచన) సినిమాతో పెద్ద విజయం అందుకున్నా తెలుగులో ఆశించినన్ని అవకాశాలైతే రాలేదింకా. ప్రస్తుతం స్నేహితులు, చెల్లెలితో కలిసి ఓ వెడ్డింగ్‌ ప్లానర్‌ కంపెనీని రన్‌ చేస్తోంది. కంపెనీ విజయవంతంగా నడుస్తోంది. అయితే ఈలోగానే బాహుబలి చిత్రాన్ని థియేటర్‌ లో చూసిన ఈ భామ ఓ వివాదాస్పద కామెంట్‌ విసిరింది. బాహుబలి చిత్రంలో తమన్నా క్యారెక్టర్‌ ని చూపించిన తీరు ఏమంత గొప్పగా లేదే! అన్న కామెంట్‌ చేసింది. కథానాయికల రోల్‌ ఎప్పుడూ హీరోల్ని హైలైట్‌ చేసేందుకేనా అని అంది.

కథానాయికల పాత్రల్ని ఎప్పుడూ వన్‌ సైడెడ్‌ గానే చూపిస్తున్నారు. నాయిక ఎప్పుడూ హీరోని మెప్పించడానికే తెరపై కనిపించాలి. అందుకు తాజా ఉదాహరణ బాహుబలి చిత్రమే. ఇందులో తమన్నా క్యారెక్టర్‌ కి అంత ప్రాధాన్యత ఏం ఉంది?' అని సూటిగా ప్రశ్నించింది తాప్సీ. ఈ అమ్మడు ఎక్కు పెట్టిన బాణం నేరుగా రాజమౌళినే ఢీకొడుతుందనడంలో సందేహమే లేదు. అలాగే రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కి కూడా బాణం తగలడం ఖాయం. ఇప్పటికే ఓ మహిళా జర్నలిస్ట్ లు , ఓ నటి తాప్సీ లానే తమన్నా పాత్ర చిత్రణపై విరుచుకుపడ్డారు. హీరో అలా దుస్తుల్ని నిస్సిగ్గుగా తొలగించి రొమాన్స్‌ చేసేయడమేంటని ప్రశ్నించారు. ఇప్పుడు తాప్సీ సూటిగా విమర్శించి లైమ్‌ లైట్‌ లోకొచ్చింది.