Begin typing your search above and press return to search.

ఈ కంత్రీకి బికినీ ఫోజులు అచ్చొస్తాయా?

By:  Tupaki Desk   |   23 May 2017 8:03 AM GMT
ఈ కంత్రీకి బికినీ ఫోజులు అచ్చొస్తాయా?
X
ఒక హీరోయిన్ బాగా ఫేమస్ అవుతుందంటే.. వెంటనే కొన్నేళ్ళకు వాళ్ళ చెల్లి కానీ మరో దగ్గర బంధువు కానీ సినిమాలోకి రావడం పరిపాటి కదా. ఇలా చాలా మంది ఉన్నారు. జోతిక –నగ్మా, కాజల్- నిషా అగర్వాల్ తరువాత అలాంటి కోవకు చెందిన మరో టాప్ హింది హీరోయిన్ కాజోల్ లిటిల్ సిస్టరే ఇక్కడ ఉన్న తనీషా ముఖర్జి.

ఈమె కూడా బాగా అందంగానే ఉంటుంది. కానీ తన నటనతో మెప్పించలేక పోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'కంత్రి'లో సెకండ్ హీరోయిన్ గా చేసింది కానీ ఎవరు అంతగా గుర్తించలేదు. కాకపోతే ఈమె అందానికి బాగా మార్కులు పడ్డాయి. అవకాశం దొరికిన ప్రతీసారి తన ఫిగర్ ను చూపించే పనిలో ఉంటుంది తనీషా. ఫ్యాషన్ షో లోకాని, బిగ్ బాస్ షో లో కానీ బయట ఈవెంట్లలో కానీ ఎప్పుడూ తన ఫ్యాషన్ తో న్యూస్ లోకి వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో తన బికినీ ఫోటో పెట్టి అందరి నోళ్లలో నానుతోంది. స్విమ్మింగ్ పూల్ పక్కన తన అందాలు విరజిమ్ముతు ఎండ ఎరుపుదనంలో తన పాల పొంగును వేడిగా ఆరబోసిందీ వయ్యారి.

ఇలాంటి ఫోటోలు ఈ అందాల చెల్లెలు చాలా పెట్టింది ఇప్పటికే. కానీ అందరూ ఆమె అందాన్ని చూసి బాగుందే అన్న వాళ్ళే తప్పితే పిలిచి సినిమా ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు ఒక అడుగు ముందికి వేసి మరింత క్లియర్ గా బికినీలో భగ్గుమంది. చూద్దాం వర్కవుట్ అవుతుందో లేదో.