Begin typing your search above and press return to search.

బాలయ్యది అంత గొప్ప కమిట్మెంట్

By:  Tupaki Desk   |   24 Jan 2017 8:01 AM GMT
బాలయ్యది అంత గొప్ప కమిట్మెంట్
X
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో నందమూరి బాలకృష్ణ కమిట్మెంట్ గురించి క్రిష్ ఆల్రెడీ చెప్పాడు. ఇప్పుడు సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మరింత డీటైల్డ్‌ గా బాలయ్య కమిట్మెంట్ గురించి వివరించాడు క్రిష్. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు ఉన్న బడ్జెట్ పరిమితుల దృష్ట్యా బాలయ్య షూటింగ్ సందర్భంగా ఎన్నో పొదుపు చర్యలు పాటించినట్లు క్రిష్ తెలిపాడు.

జార్జియాలో షూటింగ్ సందర్భంగా బాలయ్య లగ్జరీ సూట్లలో కాకుండా మిగతా నటీనటులకు బుక్ చేసిన మామూలు గదులనే తనకూ కేటాయించమని చెప్పాడట. అలాగే ఫ్లైట్ జర్నీ సందర్భంగా బిజినెస్ క్లాస్ వద్దని.. ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణించడానికి పట్టుబట్టాడట. ఇండియాకు డైరెక్ట్ ఫ్లైట్ ఉన్నప్పటికీ.. దానికి ఎక్కువ ఖర్చవుతుందని భావించి మధ్యలో ఒక చోట దిగి వేరే ఫ్లైట్ ఎక్కడానికే మొగ్గు చూపాడట బాలయ్య. అలాగే హోటల్లో బస చేస్తున్నపుడు అక్కడి నుంచే వాటర్ బాటిళ్లు తెప్పించుకుంటే విపరీతమైన రేట్లు వేస్తారని చెప్పి.. బయటికి వెళ్లినపుడు వాటర్ బాటిళ్లు తనే కొనుక్కుని వెంట తెచ్చుకునేవాడని కూడా క్రిష్ వెల్లడించాడు.

క్రిష్ ఈ విషయాలు చెబుతున్నపుడు జోక్యం చేసుకున్న తమ్మారెడ్డి బాలయ్యతో కలిసి ఒకసారి గోవాకు వెళ్లినపుడు కూడా అతను అలాగే చేశాడని.. మధ్యలో వాటర్ బాటిళ్లు బయటే కొనుక్కుని వెళ్లాడని తెలిపాడు. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా బాలయ్య ఎంతగా సహకరించింది తమ్మారెడ్డి గుర్తు చేసుకున్నాడు. ఉదయం అందరి కంటే ముందే రిహార్సల్స్ కోసం వచ్చేవాడని.. అప్పుడప్పుడూ స్టేజ్ ఖాళీ లేకున్నా.. చిన్న ఆర్టిస్టులు ప్రాక్టీస్ చేస్తున్నా ఓపిగ్గా ఎదురు చూసేవాడని.. ప్రతి పనికీ తన పర్మిషన్ అడిగేవాడని.. సాయంత్రం వెళ్లొచ్చా అని అడిగి మరీ వెళ్లేవాడని.. బయట బాలయ్య గురించి విన్నదానికి, నేరుగా చూసిందానికి చాలా తేడా ఉందని తమ్మారెడ్డి తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/