Begin typing your search above and press return to search.

పైరసీ వెబ్ సైట్ సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   22 Sep 2017 4:06 PM GMT
పైరసీ వెబ్ సైట్ సంచలన ప్రకటన
X
పైరసీ అంటే చాటు మాటు వ్యవహారంగా సాగేది ఒకప్పుడు. గుట్టు చప్పుడు కాకుండా సినిమాను పైరసీ చేయడం.. సీడీలు తయారు చేయడం.. వాటిని షాపుల్లో దాచి పెట్టి అమ్మడం.. ఇలా ఉండేది వ్యవహారం. కానీ ఇప్పుడు పైరసీ వెబ్ సైట్లు దర్జాగా ఏ భయం లేకుండా తొలి రోజే పైరసీ ప్రింట్లు పెట్టేసి జనాల్ని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా తమిళ నాట పైరసీ వెబ్ సైట్ల ఆగడాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అక్కడ సినిమా సినిమా రిలీజైన రోజు రాత్రికే పైరసీ ప్రింట్ వెబ్ సైట్లో ప్రత్యక్షమవుతున్న పరిస్థితి. ఫలానా రోజు.. ఫలానా సమయానికి పైరసీ ప్రింట్ పెడతామంటూ సోషల్ మీడియాలో ప్రకటన చేసే దుస్సాహసానికి ఒడిగడుతున్నాయి పైరసీ వెబ్ సైట్లు.

ఇంతకుముందు సూర్య సినిమా సింగం-3 విషయంలో ఇలాంటి ప్రకటనే చేసింది ‘తమిళ్ రాకర్స్’ అనే వెబ్ సైట్. ఈ వెబ్ సైట్ ను తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ టార్గెట్ చేసి బ్లాక్ చేయించే ప్రయత్నంలో ఉన్నాడిప్పుడు. అయినప్పటికీ ఆ వెబ్ సైట్ వెనక్కి తగ్గలేదు. వచ్చే నెలలో దీపావళి కానుకగా విడుదలయ్యే విజయ్ సినిమా ‘మెర్సల్’ పైరసీ ప్రింటు తమ వెబ్ సైట్లో పెడతామని అనౌన్స్ చేసిందా వెబ్ సైట్. కాకపోతే రిలీజ్ రోజు కాకుండా 15 రోజుల తర్వాత పైరసీ ప్రింట్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఇప్పుడు సైట్ కు కొన్ని ఇబ్బందులన్నాయని.. వాటిని అధిగమించి త్వరలోనే రీఎంట్రీ ఇస్తామని కూడా ఆ వెబ్ సైట్ వెల్లడించింది. మరి ఇంత ధైర్యంగా ప్రకటన చేసిన వెబ్ సైట్ విషయంలో ‘మెర్సల్’ టీం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.