Begin typing your search above and press return to search.

వేధింపుల కేసులో నటి కుమారుడు

By:  Tupaki Desk   |   17 Nov 2017 1:21 PM GMT
వేధింపుల కేసులో నటి కుమారుడు
X
సినీ తారల సుపుత్రులు ఒక్కోసారి చేసే పనులు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. సమాజంలో పదిమందికి తెలిసిన కుటుంబం పరువు ఏమైపోతుంది అని కొంచెం కూడా ఆలోచించకుండా అనవసరమైన వివాదాల్లో చిక్కుకుంటారు. రీసెంట్ గా ఇదే తరహాలో సీనియర్ నటి సుపుత్రుడు అమ్మాయిని వేధించిన కేసులో ఇరుక్కొని హాట్ టాపిక్ అయ్యేలా చేశాడు.

టాలీవుడ్ లో బాయ్స్ నుండి ఆంజనేయులు - సీమశాస్త్రి వరకు.. వివిధ సినిమాల్లో నటించిన భువనేశ్వరి అందరికి తెలిసిన ఆర్టిస్టే. అయితే ఆమె కొన్ని తమిళ్ సినిమాల్లో అలాగే సీరియల్లో కూడా నటించారు. కానీ ఎందుకోగానీ గత కొంత కాలంగా సినిమాలో కనిపించడం లేదు. ఇక అసలు విషయానికి వస్తే ఆమె కుమారుడు మిదున్ శ్రీనివాసన్(23) తనకు పరిచయం ఉన్న ఒక మెడికల్ స్టుడెంట్ ను ఈ మధ్యన ఎక్కువగా వేధింపులకు గురి చేసున్నాడని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి నానా రభస చేసినట్లు తెలుస్తోంది.

దీంతో విసిగిపోయిన ఆ యువతి అన్నా నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాసన్ ప్రస్తుతం చెన్నెలోని ఓ ప్రయివేట్ కాలేజ్ లో బ్యాచులర్ డిగ్రీ చేస్తున్నాడు. కేసు నమోదు చేసిన యువతితో అతనికి స్కూల్ దశనుండి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యన వేధింపులకు గురి చేయడంతో పోలీసులకు ఆ యువతి పోలీసులకు పిర్యాదు చేసింది.