Begin typing your search above and press return to search.

చూసేవాళ్లు ఇంకా ఎందుకు బతికున్నారో?

By:  Tupaki Desk   |   26 July 2016 2:48 PM GMT
చూసేవాళ్లు ఇంకా ఎందుకు బతికున్నారో?
X
చంద్రలేఖ అనే టైటిల్ పై ఓ తమిళ్ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది. ఇప్పటికి ఓ రెండేళ్లుగా సన్ టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఆ సీరియల్ గొప్పదనం గురించి చాలామందికి తెలిసిపోయిందిప్పుడు. చంద్రలేఖ సీరియల్ లోని ఓ రెండు నిమిషాల వీడియో క్లిప్ ఇప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇంతకీ ఆ క్లిప్ లో ఏం ఉంటుందంటే.. ఓ నటిని డైరెక్టుగా నుదిటిపై కాల్చేస్తాడో అగంతకుడు. ఆమె మహా నటి కదా.. అందుకే నుదిటి పై బుల్లెట్ తగిలినా చనిపోదు. ఆ తర్వాత పక్కనున్న వ్యక్తితో మాట్లాడుతూనే ఉంటుంది.. హాస్పిటల్ వెళుతూ మొబైల్ ఫోన్ లో పాత జ్ఞాపకాలు చూస్తూ ఉంటుంది. గంటలసేపు మాట్లాడుతూనే ఉంటుంది. అయినా ఆ పాత్ర మాత్రం చనిపోదు. నుదుటిపై బుల్లెట్ తగిలితే సెకన్ల వ్యవధిలోనే ప్రాణం పోతుందనే విషయం ఆ సీరియల్ తీసిన వాళ్లకు తెలీదో.. అందులో యాక్ట్ చేసిన వాళ్లకి తెలీదో కానీ.. సౌత్ సీరియల్స్ అంటే లాజిక్ లేకుండా అర్ధం పర్ధం లేకుండా సాగుతాయనే మాటను నిరూపించేసిందీ సీరియల్.

ఇప్పటివరకూ ఈ వీడియో క్లిప్ ను పాతిక లక్షల మంది చూసేశారంటే.. దీనికి ఎంత క్రేజ్ వచ్చిందో అర్ధమవుతుంది. అన్ని గంటల పాటు ఆ పాత్ర అలా మాట్లాడుతుంటే.. చూసేవాళ్లయినా పోతారేమో కానీ నేను మాత్రం పోను అన్నట్లుగా ఉంది ఆమె వాలకం.