ఆ తమిళ్ రేటు రూమరేనా??

Wed Nov 29 2017 13:11:32 GMT+0530 (IST)

ప్రస్తుతం ఓ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కి రెడీ అవుతోంది. మరో రెండు నెలల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీ బడ్జెట్.. నిర్మాతలను టెన్షన్ పెడుతోందనే టాక్ ఉంది.అయితే.. ఈ హీరోయిన్ కు ఓ సెన్సేషనల్ మూవీ కారణంగా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. పైగా సౌత్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్. కానీ ఈ సినిమాపై మాత్రం భారీగా డబ్బులు పెట్టేశారట నిర్మాతలు. రీసెంట్ గా ఈ మూవీ తమిళ్ డబ్బింగ్ రైట్స్ ను భారీ మొత్తానికి విక్రయించారనే టాక్ వినిపిస్తోంది. ఫిమేల్ సెంట్రిక్ మూవీ డబ్బింగ్ హక్కులు ఏకంగా 10 నుంచి 15 కోట్లు  మధ్యలో పలికాయన్నది వీటి సారాంశం. కానీ ఇది నమ్మబుద్ధేయడం లేదు అన్నది ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే.. రెండు నెలల క్రితం విడుదలైన మహేష్ బాబు మూవీ స్పైడర్ తమిళ్ హక్కులకు 18 కోట్ల రేటు గిట్టుబాటు అయింది. అది కూడా దర్శకుడు మురుగదాస్ కు ఉన్న క్రేజ్ కారణంగానే అనడంలో డౌట్ లేదు.

తమిళ్ జనాలకు తెలియని దర్శకుడు.. ఫిమేల్ సెంట్రిక్ మూవీతో సెన్సేషన్ సృష్టించినా.. ఆ తర్వాత ఆ స్పీడ్ ను నిలబెట్టుకోలేని హీరోయిన్ నటించిన సినిమాకు 10-15 కోట్లు అంటే.. బజ్ క్రియేట్ చేయడానికి సృష్టించిన రూమర్ అయి ఉంటుందని అనుకుంటున్నారు. కంటెంట్ ఉంటే తమిళ్ జనాలు మెచ్చుతారనే విషయం నిజమే అయినా.. గుడ్డిగా ఇంత మొత్తం పెట్టేసే ఛాన్స్ ఉండదన్నది టాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుస.