Begin typing your search above and press return to search.

తమిళం వెర్సస్ కన్నడ.. వివాదం ముదురుతోంది

By:  Tupaki Desk   |   24 April 2017 7:30 AM GMT
తమిళం వెర్సస్ కన్నడ.. వివాదం ముదురుతోంది
X
తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. గత ఏడాది ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరగా.. మధ్యలో పరిస్థితి కొంచెం అదుపులోకి వచ్చింది. కానీ సత్యరాజ్ తొమ్మిదేళ్ల కిందట చేసిన వ్యాఖ్యల్ని ఎత్తి చూపుతూ ‘బాహుబలి-2’ సినిమాను అడ్డుకోవడానికి కన్నడిగులు ప్రయత్నించడంతో వివాదం మళ్లీ రాజుకుంది. సత్యరాజ్‌ తో పట్టుబట్టి క్షమాపణ చెప్పించడంతో తమిళులు రగిలిపోతున్నారు.

ఈ నేపథ్యంలో తమిళనాడులో కన్నడ సినిమాల్ని నిషేధించేందుకు కోలీవుడ్లో చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఐతే కర్ణాటకలో బాహుబలి-2కు వ్యతిరేకంగా ఉద్యమం నడిపించిన వటాల్ నాగరాజ్ కూడా ఈ విషయమై దీటుగానే స్పందించాడు. తమిళనాడులో తమ సినిమాల్ని నిషేధిస్తే సంతోషమే అని.. అప్పుడు కర్ణాటకలో సైతం తమిళ సినిమాలు ఆటోమేటిగ్గా ఆగిపోతాయని ఆయన అన్నారు.

నిజానికి కన్నడ సినిమాలకు తమిళనాట ఆదరణ తక్కువే. తమిళనాడులో ఆ సినిమాల్ని నిషేధిస్తే వాటికి జరిగే నష్టం కంటే కర్ణాటకలో తమిళ సినిమాల్ని నిషేధిస్తే వాటికి జరిగే నష్టమే ఎక్కువ. కన్నడ సినిమాల పరిధి తక్కువ. కానీ తమిళ సినిమాలు కర్ణాటకలో పెద్ద ఎత్తున రిలీజవుతుంటాయి. వాటికి అక్కడ మంచి మార్కెట్ ఉంది. కాబట్టి తమిళనాడులో కన్నడ సినిమాల్ని నిషేధించాలనే డిమాండ్ అమలుకు నోచుకోవడం కష్టమే. అదే జరిగితే మాత్రం తమిళ సినిమాలకే పెద్ద పంచ్ పడినట్లవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/