Begin typing your search above and press return to search.

ఫొటోస్టోరీ : ఇదుగో తమిళ్‌ అర్జున్‌ రెడ్డి

By:  Tupaki Desk   |   22 Sep 2018 2:18 PM GMT
ఫొటోస్టోరీ : ఇదుగో తమిళ్‌ అర్జున్‌ రెడ్డి
X
విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే జంటగా తెరకెక్కిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం టాలీవుడ్‌ లో ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక వైపు విమర్శలు ఎదుర్కొంటూనే మరో వైపు నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. విజయ్‌ దేవరకొండ స్థాయిని అమాంతం పెంచేసిన అర్జున్‌ రెడ్డి చిత్రం తమిళం - హిందీ - కన్నడం - మలయాళం భాషల్లో రీమేక్‌ అవుతున్న విషయం తెల్సిందే. మొదట తమిళ భాషలో అర్జున్‌ రెడ్డి రీమేక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్‌ తో ఈ రీమేక్‌ తెరకెక్కింది. గత కొన్ని రోజులుగా ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు ముందే ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ లీక్‌ అయ్యింది. లీక్‌ అయిన పోస్టర్‌ ప్రస్తుతం తమిళ ప్రేక్షకులను మెప్పించింది. తమిళ ఆడియన్స్‌ కంటే ఎక్కువగా తెలుగు ఆడియన్స్‌ ఈ రీమేక్‌ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన ఈ చిత్రం తమిళ ఆడియన్స్‌ను ఏమేరకు ఆకట్టుకుంటుందా అని టాలీవుడ్‌ వర్గాల వారు మరియు తెలుగు మీడియా వర్గాల వారు కూడా ఇంట్రెస్ట్‌ గా ఉన్నారు.

విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా ఈ చిత్రంతో పరిచయం కాబోతున్నాడు. మొదటి చిత్రంలోనే చాలా పెద్ద ఛాలెంజ్‌ ను ధృవ్‌ నెత్తిన మోస్తున్నాడు. తెలుగు చిత్రంలో మాదిరిగానే తమిళ వర్షన్‌లో కూడా ముద్దులు భారీగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. తెలుగు అర్జున్‌ రెడ్డి లుక్‌ ను పోలి ఉన్న తమిళ్‌ ‘వర్మ’ లీక్‌ లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. బాలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్‌ ఫస్ట్‌ లుక్‌ తమిళ ఆడియన్స్‌ను మెప్పించింది. ఫస్ట్‌లుక్‌ తో సగం సక్సెస్‌ ను దక్కించుకున్న ధృవ్‌ ‘వర్మ’గా సక్సెస్‌ ను దక్కించుకోవడం ఖాయం అంటూ తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు. ఫస్ట్‌ లుక్‌ అధికారికంగా రిలీజ్‌ అయిన తర్వాత తమిళ సినీ వర్గాల వారు స్పందించనున్నారు.