Begin typing your search above and press return to search.

డిప్స్‌, రణబీర్‌.. సూపర్భ్‌ న్యూ లుక్‌

By:  Tupaki Desk   |   31 July 2015 6:07 PM GMT
డిప్స్‌, రణబీర్‌.. సూపర్భ్‌ న్యూ లుక్‌
X
పొడుగు కాళ్ల సుందరి దీపిక పదుకొన్‌ పికూ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓ వైపు కమర్షియల్‌ మసాలా సినిమాల్లో నటిస్తూనే వైవిధ్యానికి పట్టంగట్టి నవ్యపంథా క్యారెక్టర్ల లో నటిస్తోంది అన్న పేరు తెచ్చుకుంటోంది. చెన్నయ్‌ ఎక్స్‌ ప్రెస్‌, హ్యాపీ న్యూ ఇయర్‌, పికూ ఈ మూడు సినిమాల్లో దీపిక వైవిధ్యంగా కనిపించింది. ఇప్పుడు తాజాగా ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో 'తమాషా' అనే సినిమాలో వాటన్నిటికంటే డిఫరెంట్‌ లుక్‌ తో కనిపించి ఆకట్టుకోబోతోంది.

ఈసారి లవర్‌ బోయ్‌ రణబీర్‌ కపూర్‌ కి జతగా నటిస్తోంది దీపిక. టీనేజీ గాళ్‌ లుక్‌ లో కాలేజీ కెళ్లే అమ్మడిలా కనిపిస్తోంది కదూ ఈ లుక్‌ లో. పోస్టర్‌ అదిరిపోయింది. బులుగు రంగు స్లీవ్‌ లెస్‌ డ్రెస్సు పై కాంబినేషన్‌ గా చాక్లెట్‌ కలర్‌ హ్యాండ్‌ బ్యాగ్‌ ధరించింది. రణబీర్‌ న్యూ పంజాబీ లుక్‌ హెయిర్‌ స్టయిల్‌ తో డిఫరెంట్‌ గా కనిపిస్తున్నాడు. ఇంటి తలుపు తీయగానే ఓ అందమైన ప్రేమజంటను దర్శించుకునే భాగ్యం కలిగిందా? అన్నట్టు ఆ ఫోటో ఫ్రేమ్‌ అదిరిపోయింది. తమాషా చిత్రానికి ఇంతియాజ్‌ రచయిత కం డైరెక్టర్‌. నవంబర్‌ 27న ఈ సినిమా రిలీజవుతోంది. నడియావాలా గ్రాండ్సన్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకంపై షాజిద్‌ నడియావాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిప్స్‌ మరో హిట్‌ కొట్టేట్టే కనిపిస్తోంది.