Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మిల్కీ హాట్నెస్ భలే

By:  Tupaki Desk   |   22 May 2018 4:42 PM GMT
ఫోటో స్టోరి: మిల్కీ హాట్నెస్ భలే
X
సౌత్ లో హాటెస్ట్ మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. వయసు పెరుగుతున్న కొద్దీ గ్లామర్ డోస్ ని కూడా పెంచుతోంది. సినిమాల కంటే ఈ మధ్య ఫొటో షూట్ లాల్లోనే తమన్నా ఎక్కువగా కనిపిస్తోంది. సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా తన కెరీర్ ను ముందుకు తీసుకువెళుతోంది. అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లోనే ఉంటోంది.

ఇకపోతే రీసెంట్ గా ప్రముఖ మ్యాగజైన్ పీకాక్ కి ఇచ్చిన ఒక స్టీల్ లో అమ్మడు అదిరిపోయే కాస్ట్యూమ్ తో కనిపించింది. సరికొత్త డిజైన్ లో ఇది వరకు ఎవ్వరు కనిపించని లుక్ లో మెరిసింది. ఆమె హెయిర్ స్టైల్ మధ్యన అందమైన ఫెస్ లుక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మెడలో నెక్లేస్ కూడా డ్రెస్ కి మ్యాచ్ అయినట్టు సెట్ చేసుకున్న మిల్కీ బ్యూటీ కాస్త క్లివేజ్ షోను కూడా యాడ్ చేయడంతో ఫొటో లో హాట్ నెస్ కూడా కవరైంది.

ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. కళ్యాణ్ రామ్ తో చేసిన నా నువ్వే సినిమా జూన్ 1న రిలీజ్ కానుంది. అలాగే తమిళ్ మరాఠీ హిందీ సినిమాలతో పాటు సైరా నరసింహ రెడ్డి లో కూడా అమ్మడు ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.