రేట్ తగ్గించి.. ఫోన్లు కూడా చేస్తోందట

Fri Apr 21 2017 15:10:52 GMT+0530 (IST)

టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్ ఎవ్వరూ అని అడిగితే చాలాపేరు చెప్పుకోవచ్చు. అందులో ఖచ్చితంగా మిల్కీ బ్యూటీ పేరు కూడా ఉంటుంది. హాటీ తమన్నా ఇప్పుడు బాహుబలి 2 ప్రమోషన్ లో బాగా బిజీ గా తిరుగుతుంది.ఈ సినిమా ఈ నెల చివరి వారం ఏప్రిల్ 28నాడు విడుదల అవుతుంది. ఇందులో అవంతికాగా అందరి ముందుకు రాబోతుంది.ఇంత వరుకు బాగానే ఉంది కానీ ఇప్పుడు తెలుగు లో ఈ ఒక్క సినిమా తప్పితే తన చేతిలో వేరేది లేదు. దీని కోసం ఇప్పుడు చాలా తెలివిగా పావులు కదుపుతోంది  తెలుసా. ఇప్పుడు ఎలాగైనా ఒక తెలుగు సినిమా ఆఫర్ పట్టేయాలనే ఉద్దేశ్యంతో.. సాధారణంగా తీసుకొంటున్న ఫి కంటే కొంచెం  తగ్గించిందట. ఇప్పుడు ఫోకస్ అంతా అవకాశాలు మీద పెట్టిందట. అడపాదడపా ఐటెమ్ సొంగ్స్ కూడా చేసి బాగానే వెనకేసిన తమన్నా.. ఇప్పుడు కూడా భారీ పేమెంట్ కావాలనే కూర్చుంటే.. ఇక వచ్చే ఆ రెండు మూడు ఛాన్సులు కూడా వదులుకోకూడదని కాస్త కాస్టిలీ మిస్టేక్ చేసి తెలుసుకుందిలే. క్వీన్ సినిమా రీమేక్ కోసం ఈమె ఎక్కువగా డిమాండ్ చేస్తే.. అక్కడ నిర్మాతలు వేరే హీరోయిన్ తో ప్రొసీడ్ అయిపోయారనే విషయం తెలిసిందే.

ఇకపోతే తమన్నా టాలీవుడ్ లో తనకు ఉన్న ఫ్రెండ్స్ అందరికీ ఒక ఊసు వేసి ఉంచింది. ఆఫర్ లు కోసం గేర్ మార్చి అందరికీ అవకాశాల కోసం ఫోన్లు కూడా చేస్తోంది. కానీ అవి ఏవి అంతగా ప్రయోజనం చేకూర్చినట్లు లేదు. చూద్దాం మరి ఏమవుతుందో.. బాహుబలి2 రిజల్టుతో ఫేట్ ఎటైనా మారొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/