ఫస్ట్ లుక్: నాటీగా మారిన మిల్కీ బ్యూటీ

Fri Nov 09 2018 14:39:18 GMT+0530 (IST)

తమన్నా సందీప్ కిషన్లు కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'నెక్స్ట్ ఏంటి'.  'ఫనా.'.. 'హమ్ తుమ్' లాంటి విజయవంతమైన హిందీ చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను ఫిలిం మేకర్స్ కాసేపటి క్రితం విడుదల చేశారు.  టైటిల్ లోగో డిజైన్ సింపుల్ గా ప్లెజెంట్ ఫీల్ ఇచ్చేలా ఉంది.  ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ల విషయానికి వస్తే రెండూ పోస్టర్లలో తమన్నా నాటీగా కనిపించింది. మొదటి పోస్టర్లో సోఫాలో పడుకుని ఉన్న సందీప్ ను అదే సోఫాపై నిలబడి ఒక దిండుతో  కొడుతున్నట్టుగా ఉంది. ఆ నవ్వడం చూస్తుంటే సందీప్ ఏదో చిలిపి జోక్  వేసినట్టే అనిపిస్తోంది.  రెండో పోస్టర్లో సందీప్ ఏదో కోపంగా అరుస్తున్నట్టుగా పోజిస్తే.. తమన్నా మాత్రం ఎదురుగా నిలబడి వెటకారంగా వెక్కిరిస్తోంది.  రెండు పోస్టర్లు ఒక రొమాంటిక్ ఫిలిం అనే హింట్ ఇచ్చాయి.

ఈ సినిమాను లండన్ లోనూ.. హైదరాబాద్ లోనూ చిత్రీకరించారు. ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమాతో బాలీవుడ్ దర్శకుడు టాలీవుడ్ లో తన సత్తా చాటుతాడా లేదా వేచి చూడాలి.  లియోన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.