స్కూల్ క్యాంటీన్ లో మిల్కీ ఆ పనేంటి!!

Mon Feb 18 2019 11:28:36 GMT+0530 (IST)

స్కూల్ .. కాలేజ్ డేస్ జ్ఞాపకాల్ని అంత తేలిగ్గా మర్చిపోలేం. చిన్నప్పుడు ఎన్నో కలలు కంటాం. వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నించే క్రమంలో స్నేహితులకు దూరం అవ్వాల్సి ఉంటుంది. కెరీర్ ఉద్యోగం పరంగా ఎవరి దారిలో వాళ్లు వెళతాం. అయితే అలా వెళ్లి అనుకున్నది సాధించుకున్న తర్వాత తిరిగి పాత స్నేహితుల్ని కలుసుకుంటే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. కొన్నేళ్ల తర్వాత కలయిక అంటే.. కుశల ప్రశ్నలతో సరిపెట్టుకోలేరు. ఎంతగా ఎదిగారో చూసి అబ్బురపడిపోతారు. ఆనందంతో ఉద్వేగం తన్నుకొచ్చేస్తుంది. ఇదిగో ఇక్కడ అలాంటి సన్నివేశమే ఎదురైంది. స్కైల్ డేస్ తో పాటు క్యాంటీన్ లో కలగన్న కలల్ని కూడా గుర్తు చేసుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా.ఈ వీడియోలో కనిపిస్తున్న ఆ ఆరడుగుల అందగత్తె పేరు అలీఖాన్. నగరంలో ఫేమస్ డిజైనర్. అయితే తను మిల్కీ బ్యూటీ తమన్నాకి బెస్ట్ ఫ్రెండ్ అట. స్కూల్ మేట్. క్లాస్ మేట్.. బెంచ్ మేట్ కావడం... చాలా కాలం తర్వాత ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో ఇలా కలుసుకోవడంతో మిల్కీ ఉద్వేగం తట్టుకోలేకపోయింది. ఆ ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. చాలాసేపు ఒకరితో ఒకరు ముచ్చట్లాడుకున్నారు. ఆ ముచ్చట్లలో ఓ ఆసక్తికర సంగతి తెలిసింది. ``నేనేమో హీరోయిన్ అవుతాను... నువ్వేమో డిజైనర్ అవుతానని అన్నావు.. స్కూల్ క్యాంటీన్ లో ప్రామిస్ చేసుకున్నాం..  మేం అనుకున్నట్టే అయ్యాం`` అంటూ మిల్కీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది.

స్కూల్ క్యాంటీన్ లో తమ డ్రీమ్స్ ఇంకా గుర్తున్నందుకు ఈ గ్రేట్ ఫ్రెండ్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇంకా మిల్కీ బ్యూటీ కాలేజ్ లో ఉన్నప్పుడు .. డిగ్రీ పట్టా పుచ్చుకున్నప్పుడు తాను వదులుకున్న స్నేహితులను పరిచయం చేస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ భామ నటించిన `దటీజ్ మహాలక్ష్మి` రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. `ఎఫ్ 2`తో విజయం అందుకున్న తర్వాత పలు క్రేజీ ప్రాజెక్టులకు తమన్నా సంతకాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Click Here For Video