Begin typing your search above and press return to search.

తమన్నా కష్టమంతా బూడిదపాలు

By:  Tupaki Desk   |   25 April 2018 11:30 PM GMT
తమన్నా కష్టమంతా బూడిదపాలు
X
ఒక సినిమా షూటింగ్ లో ఒక షాట్ ను మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తేనే నటీనటులు విసుగెత్తిపోతుంటారు. అలాంటిది ఒక సినిమా సినిమా అంతా మళ్లీ రీషూట్ చేయాల్సి వస్తే యాక్టర్ల పరిస్థితి ఎలా ఉంటుంది? అందులోనూ సినిమా అంతా తమ మీదే నడిచే లీడ్ యాక్టర్లకు ఇది ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పేదేముంది? ప్రస్తుతం తమన్నా పరిస్థితి ఇలాగే ఉంది. ఆమె నటించిన ఓ ద్విభాషా చిత్రాన్ని మొత్తంగా రీషూట్ చేయాలని నిర్ణయించడంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి వచ్చింది మిల్కీ బ్యూటీ. ఆ సినిమా పేరు ఖామోషి. ఇంతకుముందు ‘ఈనాడు’.. ‘డేవిడ్ బిల్లా’ సినిమాలు తీసిన చక్రి తోలేటి దర్శకత్వంలో తమన్నా నటిస్తున్న చిత్రమది.

హిందీతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వశు భగ్నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐతే హిందీ వెర్షన్ రషెస్ చూసిన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. ఔట్ పుట్ ఏమాత్రం బాగా లేదని.. మొత్తం ఇప్పటిదాకా తీసిందంతా పక్కన పెట్టేసి మళ్లీ కొత్తగా రీషూట్ చేయాలని వశు ఆదేశించాడట. మరో ఆప్షన్ లేదని కూడా చెప్పేశాడట. ఈ చిత్రంలో తమన్నా మూగ అమ్మాయి పాత్ర చేస్తుండటం విశేషం. ఈ పాత్ర కోసం ఎంతో కసరత్తు చేసి కష్టపడి నటించిందట తమ్మూ. ఐతే ఇప్పుడు నిర్మాత నిర్ణయంతో ఆమె అవాక్కవుతోంది. ఆమెకు తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లో కమిట్మెంట్లు ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు ‘ఖామోషి’ కోసం డేట్లు కేటాయించాలంటే చాలా కష్టమవుతుంది. అలాగని ఈ సినిమాను విడిచిపెట్టే పరిస్థితి కూడా లేదు. ఈ స్థితిలో మిల్కీ బ్యూటీ ఏం చేస్తుందో చూడాలి.