Begin typing your search above and press return to search.

సైరా.. ఓ అద్భుతమైన అనుభవం: తమన్నా

By:  Tupaki Desk   |   10 Sep 2019 8:15 AM GMT
సైరా.. ఓ అద్భుతమైన అనుభవం: తమన్నా
X
ఈ ఏడాది 'సాహో' తర్వాత ప్రేక్షకులు అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా'. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ ఫిలిం పై తెలుగు ప్రేక్షకులే కాదు ఇతర భాషలలో కూడా ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 'సైరా' గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి.

ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించిన మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "ఇప్పుడే 'సైరా' హిందీ వెర్షన్ కు నా డబ్బింగ్ పూర్తి చేశాను. ఈ సినిమాలో భాగం కావడం ఒక అద్భుతమైన అనుభవం. త్వరలో మీ అందరిని థియేటర్లలో కలుస్తాను" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ సినిమాలో తమన్నా 'లక్ష్మి' అనే పాత్రలో నటిస్తోంది. తమన్నా పోస్ట్ చేసిన ఫోటోలో డబ్బింగ్ స్టూడియో లో స్క్రీన్.. అందులో తమన్నా ప్లెజెంట్ గా నవ్వుతూ ఉంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సైరా' లో తమన్నాతో పాటుగా పలువురు టాప్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. నయనతార.. విజయ్ సేతుపతి.. సుదీప్.. అమితాబ్ బచ్చన్..అనుష్క ఈ సినిమాలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ సినిమాకు బాణీలు అందిస్తున్నాడు.. జూలియస్ పకియం నేపథ్య సంగీతం అందిస్తున్నాడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్. భారీ తారాగణం.. టాప్ టెక్నిషియన్స్.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మెగా చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.