స్పైడర్ ను తమన్నా కొట్టేస్తుందా? ఛస్!!

Wed Sep 13 2017 23:02:12 GMT+0530 (IST)

ఒక్కోసారి కొన్ని కొన్ని మీడియా వర్గాలు ఎలాంటి ప్రచారాలు చేస్తాయంటే.. అసలు రియాల్టీకి చాలా దూరంగా.. వారి సొంత ఊహాగానాలకు చాలా దగ్గరగా ఏదేదో చెబుతుంటారు. అవి చూసి అభిమానులు కూడా కాసింత తుళ్ళిపోతుంటారు. కాకపోతే అలాంటి ఎనాలసిస్ ఏదన్నా చెప్పేటప్పుడు.. అసలు రెండు సినిమాల తాలూకు విషయాలను కంపేర్ చేసేటప్పుడు.. ఓ సన్నని బౌండరీని దృష్టిలో పెట్టుకోవాలని మర్చిపోతుంటారు.

ఇప్పుడు కొత్తగా కొన్ని మీడియాలు.. కొన్ని నెటిజన్ల పేజీలు.. పాడుతున్న పాట ఏంటంటే.. రేపు 15వ తారీఖున ''స్పైడర్'' టీమ్ ట్రైలర్ ను రిలీజ్ చేసి ఖచ్చితంగా విపరీతంగా ఎట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి.. ''జై లవ కుశ'' టీమ్ అందుకు కౌంటర్ రెడీ చేసిందట. ఏంటా కౌంటర్? మరో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారా ఏంటి? అబ్బే కాదు. ఆ సినిమాలో ఎన్టీఆర్ సరసన తమన్నా ఒక ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ టీజర్ ను కరక్టుగా స్పైడర్ ట్రైలర్ వస్తున్నప్పుడే రిలీజ్ చేసి అటెన్షన్ కొట్టేయాలని ప్లాన్ వేశారట. ఈ ప్లాన్ తెలిసే వేసినా.. తెలియకుండా వేసినా కూడా.. ఒక పెద్ద హీరో సినిమా ట్రైలర్ కు ఒక ఫేడవుట్ అవుతున్న హీరోయిన్ ఐటెం సాంగ్ టీజర్ కాంపిటీషన్ అవుతుంది అనుకోవడం కామెడీగా ఉంది.

ఒక ప్రక్కన మహేష్ బాబు.. మరో ప్రక్కన మురుగుదాస్.. అద్భుతంగా ఉండే ఒక కొత్తతరహా కథ.. విపరీతమైన గ్రాఫిక్స్ తో కూడిన కొత్త విజువల్స్.. మరో ప్రక్కన ఇప్పటికే ఎన్నో ఐటెమ్స్ ఎన్నో సాంగ్స్ చేసినా అన్నింటిలోనూ ఒకేలా గ్లామరస్ గా కనిపించే తమన్నా.. అసలు వీటి మధ్య కంపారిజన్ ఏంటి గురూ? ఛస్!!!