Begin typing your search above and press return to search.

తమ్మూకు కలిసిరాని స్కెచ్

By:  Tupaki Desk   |   15 Jan 2018 6:44 AM GMT
తమ్మూకు కలిసిరాని స్కెచ్
X
మిల్కీ బ్యూటీ తమన్నాకు ఈమధ్య టైం అస్సలు కలిసిరావడం లేదు. తమన్నా నటించిన సినిమాల్లో ఈమధ్య ఆమెకు పేరు తెచ్చిన పాత్ర ఏదన్నా ఉంది అంటే బాహుబలిలోని అవంతిక పాత్ర. అదికూడా ఫస్ట్ పార్ట్ లోనే. రెండోపార్ట్ లో ఆమె పాత్ర ఉందంటే ఉందని చెప్పుకోవడానికి తప్ప సింగిల్ డైలాగ్ కూడా లేదు. ఆ మధ్యలో బాలీవుడ్ లోకెళ్లి రెండు మూడు సినిమాలు చేసినా కౌంట్ పెరిగింది తప్ప యాక్టర్ గా వెయిట్ పెరగలేదు.

ముఖ్యంగా తమన్నాకు బాగా పేరు గుర్తింపు తెచ్చిన సౌత్ లో ఆమెకు హిట్ అన్నది అందని ద్రాక్షయి కూర్చుంది. తాజాగా తమిళంలో విక్రమ్ పక్కన స్కెచ్ సినిమాలో నటించింది. ఈ మూవీ మళ్లీ తను ఫాంలోకి రావడానికి పనికొస్తుందని అనుకుంది. స్కెచ్ తమిళంలో సంక్రాంతికి రిలీజైంది. తీరా ఈ సినిమా చూశాక ఎలాంటి అట్రాక్షన్స్ లేని ఓ మామూలు సినిమా అని క్రిటిక్స్ తేల్చి చెప్పేశారు. దానికి తోడు టాక్ కూడా అంత బాగా లేదు. ఈ సినిమాను ఫ్లాప్ జాబితాలో తేల్చేశారు. అర్జంటుగా సూపర్ హిట్ అవసరమైన తరుణంలో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తమ్ము ఫ్యూచర్ అయోమయంలో పడింది.

ప్రస్తుతం తమన్నా చేతిలో క్రేజీ ప్రాజెక్టులేమీ లేవు. కాస్తో కూస్తో బజ్ ఉన్నది నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న నా నువ్వే సినిమాకే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ క్వీన్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నా డైరెక్టర్ నీలకంఠ ఉన్నట్టుండి ఆ ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. మరి తమన్నాకు తిరిగి లైఫ్ ఇచ్చే సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడొస్తుందో?