Begin typing your search above and press return to search.

ఫొటోస్టోరీ: మిల మిల మెరిస‌న మిల్కీ అందం

By:  Tupaki Desk   |   25 Sep 2016 5:02 PM GMT
ఫొటోస్టోరీ: మిల మిల మెరిస‌న మిల్కీ అందం
X
ఇక్క‌డ చూస్తుంటే నిజంగా పాల‌రాతి శిల్పం గుర్తుకు రావ‌డం లేదూ! ఎంతైనా త‌మ‌న్నా అంద‌మే అందం. నిజంగా పాల నురుగుకుండే కాంతి కూడా త‌మ‌న్నా మేని ఛాయ ముందు చిన్న‌బోవ‌ల్సిందేనేమో అనిపిస్తుంది. అందుకే ఆమెని మిల్కీ బ్యూటీ అన్నారేమో అనిపిస్తుంది. త‌మ‌న్నాలాంటి భామ ఆర్డిన‌రీ దుస్తులేసుకొన్నా న‌లుగురిలో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తుంది. ఇక ఆమె ప్ర‌త్యేక‌మైన దుస్తులు కూడా ధ‌రించిందంటే ఆ అందం వ‌ర్ణానాతీతం అనే చెప్పొచ్చు. అందం - ప్ర‌తిభ రెండూ రాశిపోస్తే త‌మ‌న్నా ఆకారం సంత‌రించుకుంటుందేమో. అందంలోనూ - న‌ట‌న‌లోనూ త‌న‌కి తానే సాటి అనిపించుకొన్న త‌మ‌న్నా ఈమ‌ధ్య ఫ్యాష‌న్‌ పై కూడా ప్ర‌త్యేక‌మైన మ‌క్కువ ప్ర‌ద‌ర్శిస్తోంది. ఆ రిజ‌ల్టే ఇది.

ఆదివారం రాత్రి జ‌రిగిన అభినేత్రి పాట‌ల విడుద‌ల వేడుక‌కోసం త‌మ‌న్నా ఇలా ముస్తాబై వ‌చ్చింది. ఇక అక్క‌డ అంద‌రి చూపూ మిల్కీపైనే. నీలిరంగు గౌనులో నుంచి మిల్కీ అందాలు మిడిసిప‌డుతుంటే వాటిని కెమెరాల్లో బంధించ‌డానికి పోటీలు ప‌డింది మీడియా. బ‌య‌టే ఇలా క‌నిపిస్తుందంటే సినిమాలో ఇంకెంత‌గా రెచ్చ‌గొట్టిందో చూడాలి.