Begin typing your search above and press return to search.

మేకప్ లేకుండా చూస్తే పరిస్థితి ఇంతే

By:  Tupaki Desk   |   4 May 2016 4:13 AM GMT
మేకప్ లేకుండా చూస్తే పరిస్థితి ఇంతే
X
ఏ గ్లామర్ ఇండస్ట్రీని తీసుకున్నా.. వయ్యారి భామలు మేకప్ లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చే సమస్యే ఉండదు. ముఖ్యంగా సినీ హీరోయిన్స్ అయితే ఈ విషయంలో చాలా అలర్ట్ గా ఉంటారు. కానీ కొందరు మాత్రం ధైర్యంగా తమ ఫోటోలను షేర్ చేసేస్తూ ఉంటారు. అలా ఓ హీరోయిన్ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.

ఓ ఫోన్ తో అద్దం ముందు నుంచుని సెల్ఫీ తీసుకున్న ఓ వయ్యారిని చూసి.. అందరూ మొదట నిషా కొఠారి అనుకున్నారు. వాస్తవానికి అది మిల్కీ బ్యూటీ తమన్నా.. స్వయంగా తన ట్విట్టర్ పేజ్ లో షేర్ చేసిన ఫోటో అని తెలిసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. కళ్లకు మేకప్ లేకుండా దర్శనిమివ్వడంతో గుర్తుపట్టడం కష్టమైపోయింది. మేకప్ లేకుండా తమ్మూ అందంగా లేదని కాదు కానీ.. గుర్తు పట్టలేనంత ఛేంజ్ ఉండడం ఆశ్చర్యానికి గురి చేసింది.

గతంలో త్రిష కూడా ఇలాంటి ఫోటోలను షేర్ చేసి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేది. ఇప్పుడలాంటి ఎటెంప్ట్స్ చేయడంలేదు కానీ.. ఇలా మేకప్ లేకుండా త్రిష ఫోటోలు చాలానే ఉంటాయి. అప్పుడు త్రిష అయినా, ఇప్పుడు తమన్నా అయినా.. మేకప్ లేకుండా ఇంత డిఫరెంట్ గా ఉంటారనే విషయం ఇప్పుడు జనాలకు చక్కగా బోధపడింది.