Begin typing your search above and press return to search.

షారూక్ పక్కన ఛాన్స్ పట్టేసిన తమన్నా

By:  Tupaki Desk   |   9 Oct 2015 5:30 PM GMT
షారూక్ పక్కన ఛాన్స్ పట్టేసిన తమన్నా
X
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తో నటించాలని ఏ హీరోయిన్ అనుకోదు చెప్పండి ? నార్త్ అమ్మాయిలకయితే.. ఎప్పుడో అప్పుడు అవకాశం వస్తుంటుంది కానీ.. సౌత్ సుందరీమణులకు కాస్త కష్టమైన విషయమే. కానీ మిల్కీ బ్యూటీ తమన్నాకి ఆ ఛాన్స్ వచ్చేసింది. షారూక్ తో కలిసి నటించానంటూ తానే స్వయంగా ట్వీట్ చేసింది తమ్మూ.

"షారూక్ నాకు స్ఫూర్తి అంటోంది. మీతో కలిసి నటించడం చాలా గొప్ప విషయం" అంటూ ట్వీటింది తమన్నా. అయితే.. ఇదేమీ సినిమా షూటింగ్ కాదు లెండి. ఓ కమర్షియల్ యాడ్ కోసం.. తమన్నా, షారూక్ లు కలిసి నటించారు. యెప్ మీ డాట్ కాం అనే ఆన్ లైన్ ఫ్యాషన్ పోర్టల్ కోసం వీళ్లిద్దరూ జత కట్టారు. ఇప్పటికే యాడ్ షూటింగ్ కూడా పూర్తయిపోయింది. దసరా సీజన్ లో ఈ ప్రకటనను టీవీల్లో టెలికాస్ట్ చేయబోతున్నారు.

ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా.. షారూక్ తో కనీసం యాడ్ లో అయినా చేసినందుకు హ్యాపీగా ఉంది మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం ఈ భామ రవితేజ పక్కన బెంగాల్ టైగర్ లోనూ, నాగ్-కార్తిలను నటిస్తున్న ఊపిరి లోనూ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ రెండు సినిమాల తరువాత ఇంకా తెలుగులో అమ్మడు ఒక్కటి కూడా సైన్‌ చేయలేదు. వీటి రిజల్ట్‌ వస్తే కాని.. కొత్త సినిమా పడదేమో మరి.