తమన్నా అందరికి సోప్ ఏస్తోంది

Fri Jan 11 2019 23:44:58 GMT+0530 (IST)

మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ మెల్ల మెల్లగా తగ్గి పోతుంది. తెలుగులో ఈమెకు చాలా కాలంగా సరైన హిట్ పడలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో పెద్దగా సినిమాలే లేవు. ఈమె నటించిన ‘ఎఫ్ 2’ విడుదలకు సిద్దం అవ్వగా మరో వైపు క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మి చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు తప్ప తమన్నాకు మరే అవకాశాలు లేనట్లుగా తెలుస్తోంది. దాంతో తమన్నా అవకాశాల కోసం నిర్మాతలు - హీరోలకు సోప్ ఏసే పనిలో ఉంది.తాజాగా ‘ఎఫ్ 2’ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన తమన్నా మరో సారి వెంకటేష్ గారితో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానంటూ ప్రకటించింది. ఇక వరుణ్ కు జోడీగా నటించకున్నా అతడి నుండి చాలా విషయాలు నేర్చుకున్నా - అతడితో అవకాశం వస్తే తప్పకుండా చేయాలనుందంది. దిల్ రాజుపై కూడా ప్రశంసలు కురిపించి మరో అవకాశం కోసం రిక్వెస్ట్ పెట్టేసింది.

మొత్తానికి కనిపించిన ప్రతి ఒక్కరిని ఇలా ఆకాశానికి ఎత్తేస్తూ అందరికి సోప్ ఏస్తూ అవకాశాలను సంపాదించుకునేందుకు  విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరి ఈమెకు ఛాన్స్ లు దక్కేనా చూడాలి.