57 ఏళ్ల హీరోతో మిల్కీ రొమాన్స్

Tue Mar 13 2018 15:38:17 GMT+0530 (IST)

స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది తమన్నా. కొత్త హీరోయిన్ల రాకతో ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది. ఇదిగో ఇప్పుడు మళ్లీ ఓ కొత్త సినిమాతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తొలిసారి తన వయసుకన్నా రెట్టింపు వయసున్న హీరోకు జంటగా నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ జోడీగా తమన్నా ఎంపికైంది.ఇంతవరకు తమన్నా దాదాపు తన వయసు ఉన్న కుర్ర హీరోలతోనే నటించింది. అల్లు అర్జున్...రామ్ చరణ్...ఎన్టీఆర్ ఇలా. ఊపిరి సినిమాలో నటించినప్పటికీ నాగ్ కు కాకుండా కార్తికి జోడీగా నటించింది. తొలిసారి ఆమె కూడా సీనియర్ హీరోయిన్ల కలిసిపోయేందుకు సిద్దపడింది. శ్రియా - కాజల్ లాంటి హీరోయిన్లు మాత్రమే తమ కన్నా వయసులో చాలా పెద్దవారైన హీరోల పక్కన నటించారు. వారి జాబితాలో తమన్నా కూడా చేరింది. అనిల్ రావిపూ ఎఫ్2 పేరుతో ఒక సినిమా తీస్తున్నాడు. అందులో వెంకీ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. ఇందులో వెంకీ జంటగా తమన్నా ఎంపికైంది. కుర్ర హీరోల పక్కన అవకాశాలు రాకపోవడంతో ఇలా సీనియర్ హీరోల సినిమాలు ఒప్పుకుంటోందట తమన్నా.

ప్రస్తుతం తమ్మూ వయసు 28. వెంకీ వయసు 57. ఇంత వయసు తేడా ఉన్నవారి మధ్య రొమాన్స్ ఏమాత్రం పండుతుందో చూడాలి. వరుణ్ తేజ్ కు జోడీగా ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. ఆ ఛాన్సు ఎవరికి రానుందో మరి. తమన్నా ప్రస్తుతం తెలుగులో కళ్యాణ్ రామ్ పక్కన నా నువ్వే సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సినిమా క్వీన్ రీమేక్ లో చేస్తంది. ప్రస్తుతం  తమన్నాకు చేతినిండా పని దొరికినట్టే లెక్క.