తమన్నా మరో బయోపిక్ లో సెట్టయ్యిందా?

Mon Apr 16 2018 12:17:19 GMT+0530 (IST)

టాలీవుడ్ లో బయోపిక్ లపై ప్రస్తుత నటీనటులు ఆసక్తిని బాగానే చూపిస్తున్నారు. ఎప్పటికి మర్చిపోలేని వ్యక్తుల పాత్రల్లో కనిపించడానికి తెగ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళితే ప్రస్తుతం తమన్నా ద్రుష్టి కూడా ఎక్కువగా బయోపిక్ లపైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమ్మడు మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరాలో ఒక కిలక పాత్ర చేయడానికి రెడీ అయ్యింది.ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కబోతోన్న ఆ బయోపిక్ లో మిల్కీ బ్యూటీ స్పెషల్ రోల్ చాలా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అంతే కాకుండా మరో ప్రతిష్టాత్మక బయోపిక్ లో కూడా అమ్మడు కీలక పాత్ర చేచేస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి తారక రామారావు గారి బయోపిక్ ఎన్టీఆర్ చిత్రంలో తమన్నా సీనియర్ హీరోయిన్ జయప్రద పాత్రలో అలరించనుందని టాక్ వస్తోంది. ఇప్పటికే సినిమాలో ప్రధాన తరగణాన్ని బాలయ్య ఫిక్స్ చేసినట్లు సమాచారం.

అయితే తేజ బాలయ్య ఇటీవల జరిపిన చర్చల్లో జయప్రద పాత్ర కోసం కొంత మంది యంగ్ హీరోయిన్స్ గురించి మాట్లాడుకోగా ఫైనల్ గా తమన్నా సెట్ చేసినట్లు తెలుస్తోంది. వివిధ భాషలో విడుదల కాబోతోన్న ఎన్టీఆర్ చిత్రంలో జయప్రద క్యారెక్టర్ అంటే అమ్మడికి మంచి గుర్తింపు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అంతటి టాలెంట్ యాక్టర్ కి తగ్గటు తమన్నా నటిస్తుందా లేదా అనేది చూడాలి.