Begin typing your search above and press return to search.

సైరాలో ఐటెమ్ సాంగ్ కోసం కాదట

By:  Tupaki Desk   |   25 April 2018 11:51 AM GMT
సైరాలో ఐటెమ్ సాంగ్ కోసం కాదట
X
సౌత్ లో ప్రస్తుతం ఎంత మంది భామలు పోటీకి దిగుతున్న కొంతమంది సీనియర్ హీరోయిన్స్ రేంజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ లో అయితే సీనియర్ హీరోయిన్స్ స్టార్ డమ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఎదో ఒక విధంగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే ఉన్నారు. అలాగే స్పెషల్ సాంగ్స్ లలో కూడా మెరుస్తూ ఆదాయాన్ని ప్లస్ ఇమేజ్ ని పెంచేసుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం మిల్కీ బ్యూటీని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

తమన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుండి తన స్టార్ డమ్ ని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వస్తోంది. బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో వారియర్ గా కనిపించి కెరీర్ లో బెస్ట్ పెర్ఫెమెన్స్ ఇచ్చింది. ఇకపోతే ఇప్పుడు అమ్మడు మరోసారి వారియర్ గా కనిపించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న ఉయ్యాలవడ నరసింహ రెడ్డి బయోపిక్ - సైరాలో తమన్నా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందట. మొదట ఈ ప్రాజెక్ట్ లో అమ్మడు సెలెక్ట్ అయ్యింది అనగానే ఐటెమ్ సాంగ్ కోసం సెలెక్ట్ చెసుకున్నారని వార్తలు వచ్చాయి.

కానీ చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం తమన్నా ఒక వారియర్ అని తెలిసింది. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి చేసే పోరాటంలో అతని కోసం ప్రాణత్యాగం చేసే వీరనారిగా ప్రేక్షకులను అలరించనుందట. చాలా మందిని ఆడిషన్ చేసిన తరువాత దర్శకుడు సురేందర్ రెడ్డి చివరికి తమన్నాని ఫిక్స్ చెసుకున్నాడని సమాచారం. అమితాబ్ బచ్చన్ - నయనతార మరియు జగపతి బాబు - విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటీనటులు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు.