Begin typing your search above and press return to search.

రాజమౌళితో తమన్నా గొడవ సంగతులు

By:  Tupaki Desk   |   27 April 2017 2:20 PM GMT
రాజమౌళితో తమన్నా గొడవ సంగతులు
X
మరి కాసేపట్లోనే బాహుబలి ది కంక్లూజన్ సంగతులు తెలిసిపోనున్నాయి. ముందు రోజు రాత్రి సెకండ్ షోస్ నుంచే సినిమాను ప్రదర్శిస్తుండడంతో.. ఇప్పటికే జక్కన్న అభిమానులు.. బాహుబలి ఫ్యాన్స్ లో ఆతృతి పెరిగిపోయింది.

ఇలాంటి సమయంలో తమన్నా చెప్పిన కొన్ని కొత్త సంగతులు ఆసక్తిగా ఉన్నాయి. నిజానికి బాహుబలి యూనిట్ అంతా కొన్ని రోజులుగా తెగ బిజీగా ఉంది. రాష్ట్రాలు.. దేశాలు తిరిగేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభాస్.. అనుష్క.. రానా.. రాజమౌళి.. ఇలా మెయిన్ యూనిట్ అంతా తెగ చక్కర్లు కొట్టేస్తున్నా.. బాహుబలిలో అవంతిక పాత్రధారి అయిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మాత్రం ఎక్కడా కనిపించలేదు. బాహుబలి2లో ఈమె పాత్రకు బాగా కత్తెర వేసేయడంతో తమన్నా అలిగిందని.. అందుకే ప్రమోషన్స్ కు దూరంగా ఉంటోందని వార్తలు వచ్చాయి.

అయితే.. వీటన్నిటినీ ఇప్పుడు తమన్నా తోసిపుచ్చింది. రాజమౌళి అంటే ఎంతో గౌరవం ఉందన్న మిల్కీ.. మూవీ విషయంలో ఆయన ఏం చేసినా తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అంటోంది. అలాగే బాహుబలి2లో తన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని.. క్లైమాక్స్ అంతా తన చుట్టూనే తిరుగుతుందని అంటోంది తమన్నా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/