Begin typing your search above and press return to search.

ఆ హీరో క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మిల్కీ బ్యూటీ ఫిదా!

By:  Tupaki Desk   |   21 Oct 2017 3:30 PM GMT
ఆ హీరో క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మిల్కీ బ్యూటీ ఫిదా!
X
కొంద‌రు హీరోల‌కు సినిమా అంటే ఓ ప్రొఫెష‌న్‌. మ‌రికొంద‌రు హీరోల‌కు సినిమా అంటే ఒక ప్యాష‌న్. ఆ ప్యాష‌న్ ఉన్న హీరోలు తాము న‌టించే పాత్ర‌లు విల‌క్ష‌ణంగా ఉండాల‌ని కోరుకుంటారు. ఆ పాత్ర‌లో ఒదిగిపోవ‌డానికి ఎంత రిస్క్ చేయ‌డానికైనా వెనుకాడ‌రు. అటువంటి హీరోల జాబితాలో త‌మిళ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ కూడా ఒక‌రు. బాలీవుడ్ హీరో మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ త‌ర‌హాలో కోలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అన‌ద‌గ్గ హీరో విక్ర‌మ్ అంటే అతిశ‌యోక్తి కాదు. ఇదే విష‌యాన్ని విక్ర‌మ్ స‌ర‌స‌న స్కెచ్ సినిమాలో న‌టిస్తోన్న త‌మ‌న్నా చెబుతోంది. అంత స్టార్ డ‌మ్ ఉండి కూడా విక్ర‌మ్ ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంటార‌ని త‌మన్నా చెప్పింది. ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా త‌మ‌న్నా......విక్రమ్ పై ప్రశంసలు కురిపించింది.

బాహుబ‌లి త‌ర్వాత త‌మ‌న్నా మ‌రో తెలుగు సినిమాలో న‌టించ‌లేదు. ప్రస్తుతం తమిళంలో విక్రమ్ హీరోగా తెర‌కెక్కుతున్న 'స్కెచ్' సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ గొప్పనటుడనీ, ఆయనతో క‌లిసి ప‌నిచేయడం మంచి ఎక్స్ పీరియ‌న్స్ అని చెప్పింది. ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం వలన ఆయ‌న గురించి ప్రత్యక్షంగా తెలిసుకునే అవ‌కాశం క‌లిగింద‌ని తెలిపింది. విక్రమ్ ఎప్పుడూ విలక్షణమైన పాత్రలలో న‌టించాల‌ని కోరుకుంటార‌ని, ఎంచుకున్న పాత్రలో ఒదిగిపోవడానికి ప్రాణం పెడతార‌ని అంది. ఎటువంటి ప‌రిస్థితుల్లోనైనా చెప్పిన టైమ్ కి షూటింగుకు వచ్చేస్తాడని కితాబిచ్చింది. స్టార్ హీరో అయి ఉండి కూడా ఇంత‌ క్రమశిక్షణతో ఉండ‌డం చాలా ఆశ్చ‌ర్య‌క‌ర‌మ‌ని చెప్పింది. అందుకే ఆయ‌న‌ను అభిమానులు ఆ విధంగా ఆద‌రిస్తార‌నే సంగ‌తి త‌న‌కు అర్థమైందని తెలిపింది. అటువంటి హీరోతో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది.