ప్రేమ - సెక్స్ తప్పేంకాదంటోంది!

Sun Nov 18 2018 07:00:01 GMT+0530 (IST)

సందీప్ కిషన్ - తమన్నా జంటగా తెరకెక్కిన ‘నెక్ట్స్ ఏంటీ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైలెంట్ గా తెరకెక్కి ఇప్పుడు హడావుడి చేస్తున్న ఈ చిత్రంలో ఈ జనరేషన్ కు కనెక్ట్ అయ్యే ప్రేమ కథను చూపించినట్లుగా తెలుస్తోంది. బోల్డ్ కంటెంట్ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమను ఏలేస్తున్న సమయంలో ఈచిత్రం కూడా అదే తరహా బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.ఈ చిత్రంలో ప్రేమ - సెక్స్ గురించి ప్రముఖంగా చూపించినట్లుగా సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో యూనిట్ సభ్యులు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తమన్నా ప్రేమ - సెక్స్ విషయాలపై మాట్లాడుతూ.. నేను చాలా ఫ్యామిలీ చిత్రాల్లో నటించాను. వాటిని ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని చూసే విధంగా ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో మాత్రం లవ్ మరియు సెక్స్ - లవ్ మరియు సెక్స్ - లవ్ మరియు సెక్స్ కాన్సెప్ట్ తో కూడి ఉంటుందని తమన్నా పేర్కొంది.

ఇలాంటి కథను ఎంపిక చేసుకునే సమయంలో కాస్త ఆలోచించినా కూడా - ప్రస్తుతం యువతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ కథ ఉందనే ఉద్దేశ్యంతో ఒప్పుకున్నాను. నా వ్యక్తి గత అభిప్రాయం ప్రకారం కూడా ప్రేమ మరియు సెక్స్ అనేది జీవితంలో తప్పేం కాదు అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. ట్రైలర్ లో ముద్దు సీన్స్ తో ఆసక్తిని - అంచనాలను పెంచిన దర్శకుడు కునాల్ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాడా అనేది చూడాలి. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు. సచిన్ జోషి ఈ చిత్రాన్ని నిర్మించాడు. తెలుగు ప్రేక్షకులకు కునాల్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.