Begin typing your search above and press return to search.

బాహుబలిని జక్కన్న ఎప్పుడో చంపేశాడా?

By:  Tupaki Desk   |   28 Sep 2016 1:30 AM GMT
బాహుబలిని జక్కన్న ఎప్పుడో చంపేశాడా?
X
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు.. ఏడాది కాలంగా సమాధానం దొరకడం లేదు. రెండో భాగాన్ని లింక్ చేసేందుకు గాను.. ఓ టీజర్ టైపులో బాహుబలి చివరి సీన్ లో ఓ క్వశ్చన్ మార్క్ వదిలాడు జక్కన్న. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని కానీ.. ఆ ప్రశ్న ఇంతగా జనాల్లో నానుతుందని కానీ.. అప్పట్లో రాజమౌళి కూడా అనుకుని ఉండడు. అయితే.. ఒకసారి ఈ ప్రశ్నకి సమాధానం పవర్ ఏంటో తెలిశాక మాత్రం.. ఫుల్లుగా సీక్రెసీ మెయింటెయిన్ చేస్తున్నాడు. మరి బాహుబలిలో అవంతికగా మెరిసిన తమన్నాకి.. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నీకైనా తెలుసా అనే ప్రశ్న ఎదురైంది.

ప్రస్తుతం తమన్నా మూడు సినిమా ఇండస్ట్రీల మధ్య చక్కర్లు కొట్టేస్తోంది. అభినేత్రి మూవీ అటు తమిళ్ లో డెలి(ల్)గాను.. హిందీలో టూటుక్ టూటుక్ టూటియాగాను విడుదల అవుతోంది. అన్ని వెర్షన్స్ ఒకేరోజున చేయడంతో.. మూడు ఇండస్ట్రీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ అభినేత్రి ప్రమోషన్స్ లోనే.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసా అనే ప్రశ్న ఎదురైంది. మొదట ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం మానేసి.. సినిమా గురించి కాసిన్న కబుర్లు చెప్పినా.. జర్నలిస్టుల నుంచి ఆడియన్స్ నుంచి ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది.

కట్ట్ప'ఎందుకు చంపాడో అనే కాదు.. ఎప్పుడు చంపాడో కూడా తెలీదు. ఎందుకంటే ఆ సీన్ తీసిప్పుడు నేనక్కడ లేను. నాకు తెలిసినంత వరూ.. ఫస్ట్ భాగం షుటింగ్ చేసేపాటికే.. బాహుబలిని కట్టప్ప చంపేసి ఉంటాడు' అంటోంది తమన్నా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/