Begin typing your search above and press return to search.

తమన్నా అస్సలు మాట వినట్లేదట!

By:  Tupaki Desk   |   15 Jan 2019 5:01 AM GMT
తమన్నా అస్సలు మాట వినట్లేదట!
X
మిల్కీబ్యూటీ తమన్నా పుష్కర కాలంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈమె ఈ మధ్య టాలీవుడ్ కు కాస్త దూరం అయినా కూడా కోలీవుడ్ లో మాత్రం బిజిగానే కొనసాగుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో తాజాగా ఎఫ్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా నటించి తమన్నా మంచి గుర్తింపును దక్కించుకుంది.

వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న తమన్నా ఆరోగ్యం సరిగా లేదని తెలుస్తోంది. తమన్నా వరుసగా షూటింగ్స్ చేస్తూ ఆరోగ్యం విషయంలో శ్రద్ద చూపడం లేదని, దాంతో ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుందట. ఆ మధ్య అనారోగ్యంతో హాస్పిటల్ కు వెళ్లిన సమయంలో కనీసం వారం రోజులు అయినా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ తమన్నా మాత్రం బిజీ షెడ్యూల్ కారణంగా విశ్రాంతి నో చెప్పింది.

ఈ విషయమై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా తమన్నా శరీరంలో కూడా మార్పులు వచ్చాయి. తమన్నా ఇప్పటికైనా కాస్త ఆరోగ్యం విషయంలో శ్రద్ద తీసుకోవాలని అభిమానులు మరియు కుటుంబ సభ్యలు కోరుతున్నారు.