Begin typing your search above and press return to search.

ఐటెం క్వీన్ బిరుదు ఇవ్వాల్సిందే

By:  Tupaki Desk   |   24 May 2018 1:30 AM GMT
ఐటెం క్వీన్ బిరుదు ఇవ్వాల్సిందే
X
అందాల భామలు ఐటెం సాంగ్స్ చేయడం సహజమే. ఇప్పుడు టాప్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ లో స్పెషల్ గా కనిపించడం.. నర్తించడం జరుగుతోంది. ఇది ఆయా సినిమాలకు వాల్యూ ఎడిషన్ కూడా అవుతోంది. దీంతో మేకర్స్ కూడా టాప్ స్టార్స్ ను ఐటెం సాంగ్స్ లో డ్యాన్స్ చేయించేందుకు ఇష్టపడుతున్నారు.

ఇప్పటికే శృతి హాసన్.. కాజల్.. తమన్నా వంటి భామలు ఇలా స్పెషల్ సాంగ్స్ లో కనిపించారు. మిగిలిన వారితో పోల్చితే తమన్నా భాటియా లెక్క మాత్రం చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ సుందరాంగికే ఎక్కువ ఐటెం సాంగ్ ఛాన్సులు వస్తున్నాయి. హీరోయిన్ గా చేస్తున్న సినిమాల కౌంట్ తక్కువ ఉంటున్నా.. స్పెషల్ సాంగ్స్ కారణంగా ఎక్కువగా జనాలతో టచ్ లో ఉంటోంది ఈ బ్యూటీ. అల్లుడు శీను.. స్పీడున్నోడు.. జాగ్వార్.. వంటి చిన్న హీరోల సినిమాలతో పాటు.. ఎన్టీఆర్ నటించిన జై లవ కుశలోకూడా తమన్నా ఐటెం సాంగ్ కనిపించింది.

ఇప్పుడీ బ్యూటీ మరో ఐటెం సాంగ్ లో నటించేందుకు ఒప్పుకోవడం విశేషం. నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న సవ్యసాచి చిత్రంలో.. 'నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయితు' పాటకు డ్యాన్సులు చేయనుంది మిల్కీ బ్యూటీ. తమ్మూ రేంజ్ లో ఇన్నేసి ఐటెం సాంగ్స్ లో కనిపించిన మరో టాప్ హీరోయిన్ ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు.. మరి ఇలా ఐటెం సాంగ్స్ తో సరిపెడుతుందో.. లేక మిల్కీ మళ్లీ తన సత్తా చాటుతుందో చూడాలి.