Begin typing your search above and press return to search.

సినిమా ఏదైనా సేమ్ అంద‌చందాలు

By:  Tupaki Desk   |   5 Oct 2015 7:30 AM GMT
సినిమా ఏదైనా సేమ్ అంద‌చందాలు
X
మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాని తెర‌పై క‌నులారా చూసుకుని చాలా కాల‌మే అయ్యింది. బాహుబ‌లి రిలీజై అర్థ‌శ‌త‌కం పైగానే అయ్యింది. ఆ త‌ర్వాత మిల్కీ న‌టించిన వేరే సినిమా ఏదీ రాలేదు తెలుగులో. క‌త్తి ప‌ట్టి విరోచితంగా పోరాడే అవంతికగా - వీరాధివీరుడైన శివుడిని క‌వ్వించే శృంగార నాయిక‌గా క‌నిపించింది మిల్కీ. కుర్రాళ్ల గుండెల్లో ప‌చ్చ‌బొట్టేసి మ‌రీ వెళ్లిపోయింది మిల్కీ. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అవంతిక - శివుడు ప్రేమాయ‌ణం బాహుబ‌లి పార్ట్ 2లోనే చూడ‌గ‌లం.

అంత‌వ‌ర‌కూ కుర్రాల్లు వెయిట్ చేయ‌గ‌ల‌రా? రాంబాబుతో గంగ‌లా - రెబ‌ల్ నాయిక‌గా పూర్తి గ్లామ‌ర‌స్‌ గా ఎప్పుడు క‌నిపిస్తుంది? అందుకు సొల్యూష‌న్ ఏదీ లేదా? అనుకునేవాళ్ల‌కు సొల్యూష‌న్ ఇచ్చేందుకు వ‌చ్చేస్తోంది. న‌వంబ‌ర్ 5న మిల్కీ బ్యూటీ న‌టించిన బెంగాళ్ టైగ‌ర్ రిలీజ్‌ కి వ‌స్తోంది. మాస్ మహారాజా ర‌వితేజ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించిన ఈ అమ్మ‌డు రాజాతో క‌లిసి క‌నువిందు చేయ‌డానికి వ‌చ్చేయ‌నుంది. అంత‌కంటే ముందే బెంగాళ్ టైగ‌ర్ ఆడియో వేడుక లో సంద‌డి చేసేందుకు రెడీ అవుతోంది. ఈనెల 18న ఈ చిత్రం ఆడియో హైద‌రాబాద్‌ లో ఘ‌నంగా జ‌ర‌గనుంది. వాస్త‌వానికి ఈ ఆడియో ఒక రోజు ముందే అంటే అక్టోబ‌ర్ 17న జ‌ర‌గాల్సింది. కార‌ణాంత‌రాల వ‌ల్ల ఒక‌రోజు ఆలస్యంగానే వేడుకను చేస్తున్నారు. ఆడియో వ‌చ్చేలోగానే పోస్ట‌ర్ల‌తో జ‌నాల‌కు క‌నెక్ట‌వ్వ‌డానికి టీమ్ ప్లాన్ చేసింది.

బెంగాళ్ టైగ‌ర్ కొత్త పోస్ట‌ర్లు రిలీజ‌య్యాయి. వీటిలో మిల్కీ మునుప‌టిలా ఎంతో గ్లామ‌ర‌స్‌ గా క‌నిపిస్తోంది. టైట్ ఫిట్ జీన్స్‌ - టాప్స్‌ - నాభి కేంద్రాన్ని ఆవిష్క‌రిస్తూ - ప‌విట కొంగును జార‌వేస్తూ.. చీర ర‌వికెలో డిఫ‌రెంట్ గెట‌ప్స్‌ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ప్ర‌స్తుతం మిల్కీ క్రొంగొత్త అందాల గురించే చ‌ర్చ సాగుతోంది. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌రులో కె.కె.రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నాడు.