Begin typing your search above and press return to search.

ఇంకా ఎన్ని ట్రయల్స్ వేయాలో

By:  Tupaki Desk   |   23 April 2017 4:38 AM GMT
ఇంకా ఎన్ని ట్రయల్స్ వేయాలో
X
మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ హీరోయిన్ గానే జనాలకు బాగా తెలుసు. ముఖ్యంగా మంచు మనోజ్ సరసన 'శ్రీ' సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ భామ.. అంతకు ముందే 'చాంద్ కా రోషన్ చెహ్రా' అనే హిందీ సినిమాలో నటించింది కానీ.. గుర్తింపు అయింతే మాత్రం రాలేదు. ఆ తర్వాత వరుసగా తెలుగు తమిళ్ సినిమాల్లో నటించేయగా.. హ్యాపీడేస్ తో ఇక్కడ నిలదొక్కుకుంది.

హిట్స్ కౌంట్ తక్కువగా ఉన్నా.. సౌత్ లో అమ్మడికి సినిమా ఛాన్సులు మాత్రం బాగానే దక్కాయి. అయితే.. బాలీవుడ్ డ్రీమ్స్ తగ్గక.. 8 ఏళ్ల తర్వాత మళ్లీ హిమ్మత్ వాలా మూవీతో ఓ ట్రయల్ వేసింది తమ్మూ. అది దెబ్బ తినేసింది. ఆ తర్వాత ఏడాది హమ్ షకల్స్ లోనూ మెరిసింది. అదికూడా సక్సెస్ అందించలేకపోయింది. అదే ఏడాది అక్షయ్ మూవీ ఎంటర్టెయిన్మెంట్ పర్లేదనిపించినా.. ఈమెకు మాత్రం ఉపయోగపడలేదు. అయితే.. బాహుబలి తెచ్చిన క్రేజ్ కారణంగా.. అభినేత్రి మూవీని హిందీలో కూడా విడుదల చేసుకోగలిగింది.

చక్రి తోలేటి దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో కొలయతిర్ కాలం అనే మూవీ రూపొందుతుండగా.. దీన్ని హిందీలో తమన్నాను లీడ్ రోల్ లో తెరకెక్కించనున్నారు. మరి ఇన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాక.. ఈ ఎటెంప్ట్ ఏమవుతుందో చూడాలి. బాహుబలి2 తర్వాత వచ్చే మూవీ కావడంతో.. ఆసక్తి బాగానే ఉంటుందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/