ఫోటో స్టొరీ: బ్యూటిఫుల్ లెగ్స్.. హాట్ లుక్స్

Wed May 22 2019 23:00:01 GMT+0530 (IST)

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ఆడియన్స్ కు ఏం ఇంట్రో ఇస్తాం.  ఫలక్ నుమా దాస్ కు పాత బస్తీ గురించి వివరించినట్టు ఉంటుంది. తమన్నా ప్రస్తుతం చాలా బిజీగా ఉంది.  ఇటు సౌత్ లో హారర్ కామెడీ 'అభినేత్రి 2' విడుదలకు సిద్ధంగా ఉంది.  అటు బాలీవుడ్ లో క్రైమ్ థ్రిల్లర్ 'ఖామోషి' రిలీజ్ కు రెడీ అవుతోంది.  దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొంటోంది.ముఖ్యంగా హిందీ సినిమా ప్రమోషన్స్ అంటే ఆషామాషీగా ఉండవు.  అందమైన డ్రెస్సులు వేసుకొని ఫోటోషూట్లు చేయడం.. ఆ తర్వాత ఆ డిజైనర్ డ్రెస్సులలోనే ప్రమోషన్ చేయడం.. ఇదివరస. గత కొద్ది రోజులుగా 'దే దే ప్యార్ దే' కోసం రాకుల్ రచ్చ చేయడం తెలిసిందేగా. ఇప్పుడు తమన్నా వంతు.  అలాగే ఒక కలర్ ఫుల్ డ్రెస్ లో రెడీ అయి ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు తమన్నా ఇచ్చిన క్యాప్షన్ "వేసవి కాలం అంటే ఇలాంటి కలర్స్ వేసుకోవాలి! #ఖామోషి ప్రమోషన్స్".

డెనిమ్ మిడ్డీ.. చిలకపచ్చ రంగు ఇన్నర్.. పైన అదే రంగు షర్టును వేసుకుంది.  ఒక స్విమ్మింగ్ పూల్ కు దగ్గరగా స్టైలిష్ గా నిలబడింది. డ్రెస్ కలర్ కు కాంట్రాస్ట్ గా లిప్ స్టిక్..హెయిర్ ను లూజ్ గా వదిలేసినట్టుగా స్టైలింగ్ చేయడంతో తమన్నా ఒక బొమ్మ లాగా కనిపిస్తోంది.  జనాలకు ఈ పోజు తెగ నచ్చింది. ఈ ఫోటోకు నెటిజనులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. ఒకరు  "మోడరన్ అవంతిక" అన్నారు.  మరొకరు "బ్యూటిఫుల్ లెగ్స్.. హాట్ లుక్స్" అన్నారు.  ఇంకొకరు.. "మిల్కీ రాక్స్.. టెంపరేచర్ రైజెస్" అన్నారు.