నెక్స్ట్ ఏంటి తమన్నా..?

Thu Nov 08 2018 16:16:08 GMT+0530 (IST)

'హమ్ తుమ్'.. 'ఫనా' లాంటి చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి తెలుగులో ఒక సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.  తమన్నా.. సందీప్ కిషన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా చాలా రోజుల క్రితమే షూటింగ్ మొదలైనా ఎందుకో షూటింగ్ ప్రోగ్రెస్ గురించి పెద్దగా అప్డేట్లు రాలేదు.  కానీ తాజాగా సినిమాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది.ఈ సినిమాకు 'నెక్స్ట్ ఏంటి' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా మేకర్స్ వెల్లడించారు. అంతే కాదు ఈ సినిమానుండి రెండు స్టిల్స్ కూడా విడుదల చేశారు. ఒక స్టిల్ లో తమన్నా- సందీప్ లో ఉత్సాహంగా లండన్ వీధుల్లో స్టెప్స్ వేస్తుండగా మరో స్టిల్ లో సందీప్ - నవదీప్ కలిసి ఉన్నారు. ఈ సినిమాలో  పూనం కౌర్.. లారిస్సా లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు నిర్మాత అక్షయ్ పూరి. 

ఈ సినిమా మెజారిటీ భాగాన్ని లండన్ లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్.. టీజర్లను విడుదల చేస్తామని మేకర్స్ అంటున్నారు.  డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.  డిసెంబర్ లో ఇప్పటికే సినిమాలు ప్యాక్ద్ గా ఉన్నాయి. మరి ఈ 'నెక్స్ట్ ఏంటి' కి స్లాట్ దొరుకుతుందో లేదో వేచి చూడాలి.