Begin typing your search above and press return to search.

తమన్నా జాతకం తెలిసే డేట్‌ అదే

By:  Tupaki Desk   |   26 July 2016 11:40 AM GMT
తమన్నా జాతకం తెలిసే డేట్‌ అదే
X
ఏదో తమిళంలో అర కొర.. తెలుగులో బాహుబలి 2 సినిమాలో ఒక చిన్న రోల్ తప్పిస్తే.. అసలు మిల్కీ సైరన్ తమన్నా చేతిలో ఒక్కటంటే ఒక్క సరైన ప్రాజెక్టు కూడా లేదు. ఇవన్నీ ఎలా ఉన్నా కూడా.. ఏదన్నా కమర్షియల్‌ సినిమాలో మెయిన్ లీడ్ గా ఛాన్సు దొరికి.. అది హిట్టయితేనే అమ్మడి కెరియర్ మరొ కొన్నాళ్ళు కొనసాగేది. లేకపోతే మాత్రం కష్టమే.

సరిగ్గా అలాంటి సిట్యుయేషన్లోనే అమ్మడి చేతిలోకి ''అభినేత్రి'' సినిమా వచ్చి పడింది. ఈ హారర్ కామెడీ సినిమాలో అమ్మడు డ్యుయల్‌ రోల్ చేస్తోంది. సెక్సీ హీరోయిన్ గా ఒక పాత్రలో సోనూ సూద్ ను రొమాన్స్ చేస్తే.. ఇంట్లో పనమ్మాయిగా మరో పాత్రలో ప్రభుదేవాతో రొమాన్సు కొనసాగిస్తుందట. ఈ రెండు పాత్రలు కలసినప్పుడు ఏం జరుగుతుంది అనేదే సినిమా. అమలా పాల్ భర్త ఏ.ఎల్.విజయ్ రూపొందిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 9 రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు నిర్మాతలు. తెలుగులోనే కాదు.. తమిళ వర్షన్ దెవి(ల్) కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది. ఇప్పటికే త్రిష ''నాయకి'' అట్టర్ ఫ్లాప్ అయిన దరిమిళా ఇప్పుడు మిల్కీ అభిమానుల్లో కూడా కాస్త భయం నెలకొని ఉంది. ఒకవేళ అభినేత్రి తేడా కొట్టిందంటే మాత్రం.. మరి మిల్కీకి కష్ట కాలమే.

ఇప్పటికే తెలుగు ఇండస్ర్టీలో 10 సంవత్సరాల కాలం కంప్లీట్‌ చేసుకున్న తమన్నా.. మరి ఆడియన్స్ మెప్పును పొంది ఇంకొంత కాలం ఇక్కడే కంటిన్యూ అవుతందా? లేకపోతే అభినేత్రితో పర్మినెంటుగా ముంబయ్ బస్సు ఎక్కేస్తుందా? చూద్దాం!!