Begin typing your search above and press return to search.

31 రాత్రి అమెరికాలో మిల్కీ చిందులు

By:  Tupaki Desk   |   28 Nov 2015 5:12 AM GMT
31 రాత్రి అమెరికాలో మిల్కీ చిందులు
X
ప్ర‌తియేటా కొత్త సంవ‌త్స‌రం సంబ‌రాలు వ‌స్తున్నాయంటే సెల‌బ్రిటీల్లో ఒక‌టే హ‌డావుడి. 31 రాత్రి ఈవెంటుని ఓ రేంజులో సెల‌బ్రేట్ చేసుకునేందుకు ప్లాన్స్ వేస్తారు. ఏడాదికో అరుదైన‌ పండ‌గే కాబ‌ట్టి ఆరోజు ఎగ్జోటిక్ లొకేష‌న్‌ లో స్టార్ల డ్యాన్సింగ్ మూవ్స్ మ‌ధ్య జోయ్‌ ఫుల్‌ గా సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని జ‌నాలు ఉవ్విళ్లూరుతుంటారు. ఈసారి కూడా ఆ హంగామా ఘ‌నంగానే ఉండేట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌ట్నుంచే బుకింగ్‌ లు మొద‌లైపోయాయి. ప‌బ్బు - క్ల‌బ్బు - హోటల్స్‌ - మంట‌పాలు అన్నీ డిసెంబ‌ర్ 31 మిడ్‌ నైట్ వేడుకల‌కు రెడీ అయిపోతున్నాయి. ఇప్ప‌ట్నుంచే స్టార్ల బుకింగ్ కూడా పూర్త‌యిపోతోంది.

మిడ్‌ నైట్ మ‌సాలాకి వేదిక‌లు రెడీ అయిపోతున్నాయి. ఆ రాత్రివేళ సంబ‌రంలో డ్యాన్సులు చేసి అహూతుల్ని రంజింప‌జేసేందుకు స్టార్ హీరోయిన్ల‌తో ఒప్పందాలు చేసుకోవ‌డం మొద‌లైంది. అంద‌రికంటే ముందుగా మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా 31 రాత్రి జ‌రిగే ఈవెంట్ కోసం పే చెక్ అందుకుంది. అమెరికాలోని ప్ర‌ఖ్యాత గ్రేడీ కోల్ సెంట‌ర్ (కార్లొట్టే ఎన్‌సి ఏరియా) లో పెర్ఫామ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్ప‌టికే నిర్వాహ‌కులు భారీ ప్రైజ్‌ తో టిక్కెట్ల అమ్మ‌కాలు కూడా ప్రారంభించారు.

ఒక వ్య‌క్తికి 89 అమెరిక‌న్ డాల‌ర్లు చెల్లించుకోవాలి. అదే ఒక కిడ్‌ తో పాటు క‌పుల్ వేడుక‌కు రావాల‌నుకుంటే 169 అమెరిక‌న్ డాల‌ర్లు చెల్లించుకోవాలి. త‌మ‌న్నా క్రేజుతో ఈ టిక్కెట్ల‌ను భారీ రేట్ల‌కు అమ్మేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది .. త‌మ్మూ ఈ షో చేస్తున్నందుకు ఎంత పెద్ద మొత్తం అందుకోబోతోందో తెలియాల్సి ఉంది. మునుముందు టాలీవుడ్ భామ‌లు ఇంకెంత మందిని ఇలాంటి అవ‌కాశాలు వ‌రిస్తాయో చూడాల్సిందే.