Begin typing your search above and press return to search.

బాహుబలి2.. కిక్ రాలేదంటున్నారే

By:  Tupaki Desk   |   23 Oct 2016 4:26 AM GMT
బాహుబలి2.. కిక్ రాలేదంటున్నారే
X
బాహుబలి ది బిగినింగ్ విషయంలో విభిన్నమైన ప్రమోషన్స్ తో.. రాజమౌళి అండ్ యూనిట్ బోలెడన్ని టెక్నిక్స్ తో మాయ చేసేసింది. అప్పటికే క్యూరియాసిటీ పీక్స్ లో ఉండడం కూడా బాగా కలిసొచ్చింది. కానీ ఇప్పుడు బాహుబలి2 విషయంలో.. కేరక్టర్స్ మీద అంత క్రేజ్ లేదనే విషయాన్ని ఒప్పుకోవాల్సిందే.

అందుకే బాహుబలి2 ఫస్ట్ లుక్ అంటూ.. మహేంద్ర బాహుబలి వస్తున్నాడహో అని ట్వీట్ పెట్టి ప్రభాస్ పోస్టర్ వదిలారు. సిక్స్ ప్యాక్ లో అదరగొడతున్న ప్రభాస్ ఈ పోస్టర్ లో కనిపిస్తాడు. కానీ బాహుబలి టైమ్ లో.. శివలింగం భుజాన పెట్టుకున్న శివుడి ఫస్ట్ లుక్ తో పోల్చి.. విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. గ్రాఫిక్స్ పై మరీ ఎక్కువ డిపెండ్ అయిపోయి.. ప్రభాస్ బాడీని కూడా ఫైన్ ట్యూన్ చేశారంటున్నారు. చేతిలో కత్తి.. ఇనప చైన్లతో ఉన్న పోస్టర్ ని చూస్తే.. మాస్ హీరో లుక్ లా ఉంది తప్ప.. బాహుబలిపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగా లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

రాజుల కాలంలో సిక్స్ ప్యాక్ ఏంటో అని.. ఆ లుక్ నేచురల్ గా లేదని.. మోషన్ పోస్టర్ లో మ్యూజిక్ తప్ప.. గ్రాఫిక్స్ అద్భుతంగా లేవని ఎవరి ఊహలకు తగ్గట్లుగా వారు విమర్శించేస్తున్నారు. అయినా.. అన్నీ ఫస్ట్ లుక్ లో చూపించేస్తే.. తర్వాత చూపించి థ్రిల్ చేయాలంటే కష్టం కదా. అందుకే రాజమౌళి మళ్లీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసినట్లున్నాడులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/