Begin typing your search above and press return to search.

చీప్‌ ట్రిక్సా? ఎర్నింగ్‌ ఫార్ములానా??

By:  Tupaki Desk   |   31 Aug 2015 11:40 AM GMT
చీప్‌ ట్రిక్సా? ఎర్నింగ్‌ ఫార్ములానా??
X
అప్పటికే రిలీజై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన సినిమాని ఇంకా పెద్ద హిట్‌ చేయడం ఎలా? రెండు మూడు వారాల తర్వాత కూడా వసూళ్లు రావాలంటే ఏం చేయాలి? దీనికో ఫార్ములా ఉంది. ఎడిటింగ్‌లో పోయిన కొన్ని అదనపు సీన్ లు జోడించి పబ్లిసిటీ చేస్తే అభిమానుల్ని థియేటర్లకు మళ్లీ రప్పించవచ్చు. ఇది అనాదిగా ఆచరిస్తున్నదే. ఈ ఫార్ములా చాలా సందర్భాల్లో వర్కవుటవుతూనే ఉంది.

ఇకపోతే సినిమా తీయడం ముఖ్య ఉద్ధేశ్యం డబ్బు సంపాదించడం. ప్రపంచీకరణ వ్యవస్థలో అదే ధర్మం అయిపోయింది. అయితే కొత్త సీన్ లు కలిపాం అంటూ అభిమానుల్ని ఆకర్షించి వారి జేబు గుల్ల చేయడం ఎంతవరకూ సబబు అని కొందరు విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. చీప్‌ ట్రిక్స్‌ అంటూ కొట్టిపారేస్తున్నారు. లేటెస్టుగా రిలీజైన శ్రీమంతుడు విషయంలోనూ ఇదే చేశారు నిర్మాతలు. కొన్ని అదనపు సీన్ లు జోడించాం. మళ్లీ థియేటర్లకు రండి అంటూ పిలుపునిచ్చారు.

ఇలా చేస్తే పదే పదే థియేటర్లకు వచ్చే ఫ్యాన్స్‌ కి జేబు గుల్ల అయినట్టే మరి. అలాగని వ్యాపారస్తులు మారాలా? అంటే అసలు సినిమా తీసేదే వ్యాపారానికి కదా! అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మనోభావాల పేరుతో చేసుకుంటే పోతే వ్యాపారం నడుస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ మిర్చి, అత్తారింటికి దారేది వంటి సినిమాలకు ఈ ఫార్ములా అప్లయ్‌ చేసి బాగానే లాభాలార్జించారు. ఇప్పుడు శ్రీమంతుడు వంతు వచ్చిందన్నమాట!