బెబో బాబు ముద్దు పేరేంటో తెలుసా?

Fri Jan 12 2018 23:00:01 GMT+0530 (IST)

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఓ 13 నెలల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాయ్ మూర్ ఖాన్ అంటూ ఈ బాబుకు పేరు పెట్టుకున్నారు సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ జంట. సహజంగా ఒకరిని మరో ముద్దు పేరుతో పిలుచుకోవడం కామన్. కరీనా కపూర్ ను జనాలు బెబో అని పిలుచుకుంటారు. మరి బెబో కన్న కొడుకు ముద్దు పేరేంటి అనే ఆసక్తి ఉండడం సహజమే.ఇప్పటివరకూ ఈ ముద్దులొలికే చిన్నా నిక్ నేమ్ ఏంటో తెలీదు కానీ.. ఇప్పుడా సీక్రెట్ గుట్టు విప్పేశాడు సైఫ్ అలీ ఖాన్. కాలాకాండీ ప్రీమియర్స్ సందర్భంగా అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన సైఫ్.. తన కొడుకుతో కమర్షియల్స్ చేసేందుకు రెడీ అంటున్నాడు. మాంచి ఆఫర్ వస్తే.. గట్టి పేమెంట్  ముట్టితే.. కొడుకుతో కలిసి అడ్వర్టెయిజ్మెంట్స్ లో చేస్తానంటున్నాడు సైఫ్. తన కొడుకు గురించి తెగ కబుర్లు చెప్పేస్తూ.. మధ్యలో కొడుకు ముద్దు పేరు కూడా చెప్పాడు సైఫ్. ఇవాల్టి రోజుల్లో ముంబై పిల్లలు మహా స్పీడ్ గా ఉంటున్నారని అన్న సైఫ్ అలీ ఖాన్.. తన కొడుకు కాసింత పెద్దయిన తర్వాత.. కనీస మర్యాద నేర్చుకుంటే చాలని అంటున్నాడు.

నమస్తే అన్న పదాన్ని స్పష్టంగా చెప్పగలిగితే చాలు అన్న సైఫ్.. ప్లీజ్.. థ్యాంక్యూ వంటి పదాలను 'టిమ్' స్పష్టంగా చెప్పాలని కోరుకుంటున్నట్లు అన్నాడు సైఫ్. అలా తన కొడుకు ముద్దు పేరు టిమ్ అంటూ గుట్టు విప్పాడు బెబో భర్త సైఫ్.