ఏడాది కొడుక్కి కోటి రూపాయల గిఫ్ట్

Wed Nov 15 2017 00:15:33 GMT+0530 (IST)

సెలబ్రెటీలు వారి పిల్లలను ఎలా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా సెలబ్రేషన్స్ వస్తే చాలు వారి ఉహాలకందని గిఫ్ట్స్ ఇస్తూ.. పిల్లలను సర్ ప్రైజ్ చేస్తుంటారు. ముఖ్యంగా పుట్టినరోజు వేడుకలు వస్తే చాలు వారి రేంజ్ కి తగ్గ బహుమతులు ఇస్తుంటారు. పిల్లలు ఎంత పెద్ద వారైనా.. ఇంకా చిన్న పిల్లలే అన్నట్టుగా వారితో ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నిస్తారు చాలా మంది సెలబ్రిటీ పేరెంట్స్.చిల్డ్రన్స్ డే సందర్భంగా.. కొంత మంది సినీ పేరెంట్స్ వారి పిల్లల కోసం స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఒక బాలీవుడ్ హీరో మాత్రం ఒక సంవత్సరం వయసు కూడా లేని తన కొడుకుకి కోటి రూపాయల కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. అతను ఎవరో కాదు బాలీవుడ్ ‘నవాబ్’ సైఫ్ అలీ ఖాన్. గత ఏడాది సైఫ్ సతీమణి కరీనా కపూర్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తైమూర్ అని పేరు పెట్టుకున్నారు. అయితే బాలల దినోత్సవ సందర్భంగా సైఫ్ తన కుమారుడికి తొలి కానుకగా  కోటి రూపాయలు ఖరీదైన రెడ్ కలర్ ఎస్ఆర్టీ కారుని కానుకగా ఇచ్చాడు.

అంతే కాకుండా కారులో తైమూర్ కూర్చోవడానికి ఒక స్పెషల్ సీటును కూడా డిజైన్ చేయించాడట. ఈ విషయాన్ని సైఫ్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇక ఈ చిన్నారి డిసెంబర్ 20న తొలి పుట్టినరోజును జరుపుకొనున్నాడు. మరి ఇప్పుడే కారును కొనిచ్చాడంటే అప్పుడు ఇంకేం కొనిస్తాడో అనే ఆసక్తి నెలకొంది.