Begin typing your search above and press return to search.

బాలీవుడ్ క్షణం కాస్టింగ్.. అదిరిపోయింది

By:  Tupaki Desk   |   27 April 2016 1:30 PM GMT
బాలీవుడ్ క్షణం కాస్టింగ్.. అదిరిపోయింది
X
టాలీవుడ్ క్షణం ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో చూశాం. అతి తక్కువ బడ్జెట్ తో వచ్చి, పెట్టుబడికి 3-4 రెట్లు థియేటర్లను రాబట్టేసింది ఈ మూవీ. అదే స్థాయిలో శాటిలైట్ హక్కులు - రీమేక్ రైట్స్ అమ్మి.. నిర్మాతకు లాభాల పంట మిగిల్చిన సినిమా క్షణం. ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్ లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేయనున్నారు. తెలుగులో ఆదాశర్మ పోషించిన పాత్రను.. హిందీలో కూడా కంటిన్యూ చేస్తుండగా.. మిగిలిన ప్రధాన పాత్రధారులు మాత్రం మారుతున్నారు.

టాలీవుడ్ క్షణంలో అనసూయ పోషించిన పాత్ర సినిమాకి చాలా కీలకం. ఓ పోలీసాఫీసర్ పాత్రను యాంకర్ అనసూయ చేయగా.. హిందీ వెర్షన్ కోసం సీనియర్ హీరోయిన్ ని తీసుకొస్తున్నారు. విభిన్నమైన చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్న టబు.. బాలీవుడ్ క్షణంలో అనసూయ రోల్ చేయనుంది. ఈ పాత్రకు ఆమె అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారట.

ఇక తెలుగులో సత్యం రాజేష్ పోషించిన పోలీస్ పాత్రకు కూడా ఎంపిక పూర్తయిపోయింది. వెర్సటైల్ యాక్టర్ గుర్తింపు పొందిన నవాజుద్దీన్ సిద్దిఖీ.. సత్యం రాజేష్ రోల్ లో కనిపించనున్నాడు. సల్మాన్ ఖాన్ - ఆదాశర్మ - టబు - నవాజుద్దీన్ సిద్దికీ.. ఇలా కాస్టింగ్ తోనే సినిమాపై బోలెడంత ఇంట్రెస్ట్ కలిగించేశారు బాలీవుడ్ క్షణం మేకర్స్.